సమంత క్రాకర్స్‌తో సంబరాలు చేసుకున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన 'గీత గోవిందం' బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం సంబరాల్లో మునిగిపోయింది. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు సైతం బావుందంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

తాజాగా ఈ లిస్టులో సమంత కూడా చేరింది. మూవీ చూశాక హీరోయిన్ సమంత రియాక్ట్ అవుతూ 'గీత గోవిందం' తనకు చాలా నచ్చిందని, ఇకపై విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ నటించిన సినిమాలను తప్పకుండా చూస్తాను. టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసింది.
సమంత ట్వీట్‌కు విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ థాంక్స్ చెప్పారు. అనంతరం సమంత ఫోటోతో కూడిన క్రాకర్స్ ఫోటో పోస్టు చేస్తూ ''నాకెంతో ఇష్టమైన 'సమంత' క్రాకర్స్‌తో సంబరాలు జరుపుకొంటున్నామని పేర్కొన్నారు.
'గీత గోవిందం' చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్2 బేనర్లో అల్లు అరవింద్ సమర్పకుడిగా బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. 'గీత గోవిందం' చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16 కోట్ల గ్రాస్... దాదాపు రూ. పది కోట్ల షేర్ వసూలైంది. అమెరికాలో హాలిడే లేక పోయినా బుధవారం విడుదలైన అక్కడ తొలి రోజు రూ. 3 కోట్లకుపైగా రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్య పరిచింది.


Click it and Unblock the Notifications











