రష్మిక నా 'డార్లింగ్'.. కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పటినుంచి జరుగుతూనే ఉంది. వీరిద్దరూ కలిసి మొట్ట మొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కనిపించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరిద్దరూ మరో సినిమాలో కూడా అవకాశం దక్కింది. అలా వీరిద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమాలో కూడా కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం మొదలైంది. దానికి తోడు గీతగోవిందం సినిమాలో ఒక ముద్దు సీన్ కూడా ఉండడంతో వాడు ఇద్దరికీ ఏదో అఫైర్ ఉందనే ప్రచారం జరుగుతూ వస్తుంది. వాటిని వారిద్దరు ఖండిస్తూ వస్తున్నారు. అంతే తాజా కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలలోకి వెళ్తే

రకరకాల ప్రచారాలు
చలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన తర్వాత గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అయితే అంతకుముందే తన ప్రియుడితో చేసుకున్న ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో దానికి కారణం విజయ్ దేవరకొండ అని విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడింది కాబట్టే మొదటి ప్రియుడిని వదిలేసి విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిందని రకరకాల ప్రచారాలు జరిగాయి.

తడబడకుండా
అయితే ఈ విషయం మీద ఎప్పటికప్పుడు ప్రచారాలు జరుగుతూ రావడం వాటికి రష్మిక మందన కానీ విజయ్ దేవరకొండ గాని ఏదో ఒక రకంగా క్లారిటీ ఇవ్వడం జరుగుతూనే వస్తున్నాయి. అయితే తాజాగా విజయ్ దేవరకొండ కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా కరణ్ జోహార్ రష్మిక గురించి కొన్ని ప్రశ్నలు అడగగా దానికి విజయ్ దేవరకొండ తడబడకుండా సమాధానాలు చెప్పాడు. తనకు రష్మిక ఒక మంచి డార్లింగ్ అని చెప్పుకొచ్చాడు.

మంచి డార్లింగ్ అంటూ
మా ఇద్దరి కెరియర్ ఒకసారి దాదాపుగా ప్రారంభమైందని కెరియర్ మొదట్లోనే ఇద్దరం కలిసి రెండు సినిమాలు చేయడంతో ఇద్దరికీ మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. షూటింగ్ సమయంలో మంచిగా పరిచయం ఏర్పడడంతో ఇద్దరం కలిసి తమ బాధలు షేర్ చేసుకునే వాళ్ళమని తాను ఎప్పటికీ నాకు ఒక మంచి డార్లింగ్ అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. నిజంగా రష్మిక నా నిజమైన డార్లింగ్. తనంటే నాకు చాలా ఇష్టం' అంటూ చెప్పడం ఆసక్తిని పెంచింది.

కాఫీ విత్ కరణ్ షోలో
అయితే ఈ విషయంలో విజయ్ దేవరకొండ తన ప్రేమ గురించి మాత్రం ఎలాంటి కామెంట్స్ అయితే చేయలేదు. ఇక కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ అనన్య పాండేతో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. అనన్య పాండే లవర్ గురించి కూడా కరణ్ జోహార్ కొన్ని ప్రశ్నలు అడిగి ఆమె ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.

25వ తేదీన
ఇక విజయ్ దేవరకొండ అనన్య పాండే కలిసిన నటిస్తున్న లైగర్ సినిమా ఆగస్టు నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా చార్మి కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున ప్లాన్ చేసింది సినిమా యూనిట్. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్గా నిర్వహించగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పలు సిటీలలో గ్రాండ్గా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











