పవన్ కళ్యాణ్ తో యేడాది పనిచేసా, అదే విజయదేవరకొండ ‘ద్వారక’కథ

ద్వారక చిత్రం స్టోరీ లైన్ ని రివీల్ చేసారు దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర

By Srikanya

హైదరాబాద్ : "పెళ్లిచూపులు"తో హై సక్సెస్ సొంతం చేసుకొన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు.

"లెజెండ్ సినిమా" బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదలతోపాటు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొంది. మార్చి 3న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు.

ఎర్రశీను కథే

ఎర్రశీను కథే

‘‘ద్వారక అనే అపార్ట్‌మెంట్‌లో శ్రీకృష్ణుడి తరహా లక్షణాలున్న ఎర్రశీను అనే కుర్రాడుంటాడు. అతనో దొంగ. దేవుడు అంటే ఏంటి? అని హీరో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు దొంగ, రొమాంటిక్‌గా కూడా ఉంటాడు. కానీ, నేను సర్వాంతర్యామి అంటాడు హీరోయిన్‌ పాత్ర పేరు వసుధ. వసుధతో ప్రేమలో పడ్డ తర్వాత హీరో ఏవిధంగా పరిణతి చెందాడో చెప్పే కథే ఈ సినిమా.. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు తనని బాబాని చేస్తారు. ఎందుకు, ఏమిటి? అనే విషయాలు తెరపై చూడాల్సిందే.ఇది వ్యంగ్య హాస్య చిత్రం. ''

పవన్ తో యేడాది ప్రయాణం

పవన్ తో యేడాది ప్రయాణం

‘‘స్వతహాగా పెయింటర్ని. అనుకోకుండా సినిమా రంగంవైపు వచ్చా. తమ్మారెడ్డి భరద్వాజ, వీరశంకర్‌, భీమనేని శ్రీనివాసరావుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశా. పవన్‌కల్యాణ్‌తోనూ ఓ ఏడాది ప్రయాణం చేశా. దిల్‌రాజు ‘కొత్తబంగారులోకం'కి, ‘గ్రీకువీరుడు'కీ కొంతమేర స్క్రీన్‌ప్లే విభాగంలో సహకారం అందించాను. ఓ దర్శకుడిగా కథాబలం ఉన్న వినోదాత్మక కుటుంబ చిత్రాల్ని అందించాలనే తపనతో ఉన్నా''

షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్వాన్స్

షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్వాన్స్

దర్శకుడు శ్రీవాస్‌గారికి నాలుగు సంవత్సారాల కిందట 'ద్వారక' కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చటంతో మా ఇద్దరికీ పరిచయమైన ప్రద్యుమ్నగారికి చెప్పించారు. కథ విన్న వెంటనే, ఈ సినిమా మనం చేస్తున్నామని, షేక్‌హ్యాండిచ్చి అడ్వాన్సు ఇచ్చారు. విజయ్‌ దేవరకొండ అద్భుతంగా నటించాడు.

ప్రేమే దేవుడు అని చెప్పే కథ ఇది

ప్రేమే దేవుడు అని చెప్పే కథ ఇది

‘‘ఈ కథ మూడేళ్ల కిందటే తయారైంది. ‘ద్వారక'లో చాలా కోణాలున్నాయి. ఓ దొంగ బాబాగా మారడం, అమ్మాయి ప్రేమను పొందేందుకు పోరాడడం, చివరికి విజేతవడం లాంటివన్నీ ఆసక్తిగొలుపుతాయి. ‘ప్రేమే దేవుడు' అని చెప్పే సినిమా ఇది. స్వామీజీలపై వ్యంగ్యాస్త్రాలూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడా? లేడా? అనే లోతైన అంశాల్ని ఏమాత్రం చర్చించడం లేదు. ‘గోపాల..గోపాల', ‘ఓ మైగాడ్‌' సినిమాలతోనూ పోలికే ఉండదు. మున్నాభాయ్‌ తరహా స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకొనేలా తెరకెక్కించాం''

మెగా నిర్మాతల్ని..

మెగా నిర్మాతల్ని..

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ .....``పెళ్లి చూపులు విజ‌యంతో క్ష‌ణం తీరిక లేకుండా అయిపోయాను. ఆ విజ‌యాన్ని ఆస్వాధిస్తుండ‌గానే `ద్వ‌రాక‌` వ‌చ్చేస్తోంది. అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో, ఆర్‌.బి.చౌద‌రి గారి బ్యాన‌ర్‌లో సినిమా అంటే షాక్‌కి గుర‌య్యాను. మెగా నిర్మాత‌ల్ని నా ఖాతాలో వేసుకున్నానా? అనిపించింది. ద్వార‌క క‌థ న‌చ్చి ఓకే చెప్పాను. వైవిధ్యం ఉన్న క‌థ‌ని నిర్మాత‌లు ఎంక‌రేజ్ చేయ‌డం హ్యాపీ. గ‌ణేష్ కొరియోగ్ర‌ఫీలో వైవిధ్య‌మైన డ్యాన్సులు వేశాను`` అన్నారు.

అలాంటి నిర్మాత అండగా

అలాంటి నిర్మాత అండగా

నిర్మాత ప్ర‌ద్యుమ్న‌ మాట్లాడుతూ -"శ్రీనివాస్ ర‌వీంద్ర‌(ఎం.ఎస్.ఆర్‌) దర్శ‌క‌త్వం వ‌హించిన ద్వార‌క సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. పెళ్ళిచూపులు త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఈ సినిమా క‌చ్చితంగా త‌న‌కు మ‌రో హిట్ మూవీ అవుతుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. మా సినిమాకు ఆర్.బి.చౌద‌రి వంటి సీనియ‌ర్ నిర్మాత‌గారు అండ‌గా నిల‌బ‌డ‌టం మాలో మ‌రింత ఆత్మ‌విశ్వాస్వాన్ని నింపింది. మంచి ఆర్టిస్టుల‌తో పాటు మంచి టెక్నిక‌ల్ టీం కుదిరింది. ఇటీవ‌ల సాయికార్తీక్ అందించిన పాట‌లు మార్క‌ట్లోకి విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ల‌క్ష్మీభూపాల్ మాట‌లు, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. నవంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

ఈ సినిమా కు పని చేసిన టీమ్

ఈ సినిమా కు పని చేసిన టీమ్

విజయ్‌ దేవరకొండ, పూజ జవేరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్‌, కృష్ణభగవాన్‌, షకలక శంకర్‌, ఉత్తేజ్‌, నవీన్‌, గిరిధర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీభూపాల్‌, ఫైట్స్‌: విజయ్‌, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: సాయికార్తీక్‌, నిర్మాతలు: ప్రద్యుమ్న, గణేష్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌ రవీంద్ర(ఎం.ఎస్‌.ఆర్‌).

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X