లవ్ అనేది బుల్షిట్.. రిలేషన్‌షిప్ ఉంటే చెప్పాలా? ఆ ఇద్దరితో.. విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా పాగా వేసేందుకు విజయ్ దేవరకొండ ప్లాన్స్ వేస్తున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి హిట్లతో కెరీర్‌ను చక్కదిద్దుకొంటూ.. డాషింగ్, డైనమిక్ హీరోగా పేరు తెచ్చుకొంటున్న విజయ్ దేవరకొండ మరోసారి సత్తా చాటాడు. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు పురుషులను పరిగణనలోకి తీసుకొని Most Desirable Man 2019 కోసం నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో విజయ్ దేవరకొండ టైటిల్‌ను వరుసగా రెండోసారి సొంతం చేసుకొన్నాడు. ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకొన్నారు.

ప్రేమ అనేది ఓ ఫీలింగ్ మాత్రమే

ప్రేమ అనేది ఓ ఫీలింగ్ మాత్రమే

ప్రేమ అనేది గొప్ప భావన.. దానిని మాటలతో వర్ణించలేం. దానిని ఫీల్ కావాల్సిందే. చాలా రకాల ఫేజ్‌లను దాటుకొంటూ వచ్చిన తర్వాత లవ్ అనేది బుల్షిట్ అనేది నా ఫీలింగ్. లవ్ అనేది గ్రీటింగ్ కార్డులు అమ్మకోవడానికి పనికివస్తుందే తప్ప మరోటి కాదు. ఇద్దరి మధ్య ఉంటే ఇష్టాన్ని ప్రేమగా చెప్పొచ్చా అనే విషయంపై క్లారిటీ లేదు. దానిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రకృతిలో లవ్ అనేది డైనమిక్. పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అలాంటి దానిని మాటల్లో చెప్పలేం అని అని విజయ్ దేవరకొండ అన్నారు.

రిలేషన్‌షిప్ ఉంటే చెప్పాలా?

రిలేషన్‌షిప్ ఉంటే చెప్పాలా?

నాకు ఎవరితోనైనా రిలేషన్‌షిప్ ఉంటే సీక్రెట్‌గా ఉంచుతాను. బయట ప్రపంచానికి ఎందుకు చెప్పాలి. రిలేషన్‌షిప్ అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. అవసరం అనుకొంటే నా తల్లిదండ్రులకు, నా స్నేహితులతో పంచుకొంటాం. సందర్భాన్ని బట్టి ప్రపంచానికి చెప్పాలా? లేదా అనేది ఆలోచిస్తాను. నా జీవితం మరోకరికి వినోదంగా మారకూడదనే నా అభిప్రాయం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

కియారా, జాన్వీతో నటించాలని

కియారా, జాన్వీతో నటించాలని

ఇప్పుడున్న ప్రతిభావంతులైన హీరోయిన్లతో నటించాలని అనుకొంటున్నాను. కియారా అద్వానీ, జాన్వీ కపూర్‌తో కలిసి నటించడానికి ఎదురుచూస్తున్నాను. ఇండస్ట్రీలో అందంగా ఉండే ఎవరితోనైనా నటించడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. అందం, ప్రతిభనే నాకు కొలమానం అని విజయ్ దేవరకొండ తెలిపారు.

Recommended Video

Vijay devarakonda - Puri Jagannath's Fighter Movie Update | VD 10
వ్యక్తిగత జీవితాల్లోకి దూరొద్దు

వ్యక్తిగత జీవితాల్లోకి దూరొద్దు

వ్యక్తిగత జీవితాల్లోకి మీడియా దూరడం నాకు ఇష్టం ఉండదు. ఫ్రొఫెషనల్ ఉంటే బాగుంటుందనే నా అభిప్రాయం. కొన్నిసార్లు ఫొటోగ్రాఫర్లు వెంటాడుతుంటారు. నాకు ఇష్టం లేకుంటే వద్దని వారిస్తాను. నాకు మూడ్ బాగాలేని సమయంలో నన్ను ఇబ్బంది పెట్టవద్దని చెబుతాను. షూట్స్ లేకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాను. బయట కనిపించడానికి, తిరగడానికి నేను ఇష్టపడను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X