twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌తో ఢీ కొంటే నష్టపోతానని తెలుసు... వాళ్లు అలా అనడం నచ్చలేదు: విజయ్ దేవరకొండ

    |

    Recommended Video

    Vijay Deverakonda Talks About Coincidence With NTR Movie

    విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సినిమాకు సంబంధించిన, తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు తనను ట్రోల్ చేసిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. నోటా రిలీజ్ డేట్ ఫైనల్ చేసేందుకు విజయ్ పోల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 ఆప్షన్లు ఇచ్చారు. అయితే అక్టోబర్ 10న తారక్ సినిమాతో విడుదల చేసే దమ్ముందా? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

    అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ 'వర్మ'పై విజయ్ దేవరకొండ రియాక్షన్!అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ 'వర్మ'పై విజయ్ దేవరకొండ రియాక్షన్!

    ఎన్టీఆర్‌తో పెట్టుకుంటే నష్టపోతానని తెలుసు

    ఎన్టీఆర్‌తో పెట్టుకుంటే నష్టపోతానని తెలుసు

    కామన్‌సెన్స్ వైజ్.... ఒక పెద్ద స్టార్ సినిమాతో నా సినిమా రిలీజ్ చేస్తే నా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. ఆ విషయం నాకూ తెలుసు. నా సినిమా బడ్జెట్‌తో పోలిస్తే ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎక్కవ మంది ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న యాక్టర్. సినిమా బావుందా? బాగోలేదా? అనే విషయంతో సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్ ఉంటే చాలు చూడటానికి వచ్చే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. కామన్ సెన్స్ వైజ్ ఆయన సినిమా రోజే నా సినిమా రిలీజ్ చేస్తే నష్టపోయేది మేమే... అని విజయ్ అన్నారు.

     రీలీజ్ చేయొద్దని ట్రోల్ చేయడం నచ్చదు

    రీలీజ్ చేయొద్దని ట్రోల్ చేయడం నచ్చదు

    అయితే.... నువ్వు ఆ రోజు నీ సినిమా రిలీజ్ చెయ్యడానికి వీల్లేదు అని నన్ను ట్రోల్ చేయడం నచ్చదు. ఎందుకంటే ఆ రోజు సినిమా రిలీజ్ చేయొద్దు అనే కామన్ సెన్స్ నాకుంది.... అని విజయ్ దేవరకొండ తేల్చి చెప్పారు.

    జనాలు రారు అనుకోవద్దు, ఆ సమస్య వేరు...

    జనాలు రారు అనుకోవద్దు, ఆ సమస్య వేరు...

    తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఒక సినిమా 100 కోట్ల బిజినెస్ చేస్తే సినిమా దాదాపు ఒక కోటి 20 లక్షల మంది చూసినట్లు లెక్క. అందులో 20 లక్షల మంది రెండు సార్లు చూసిన వారుంటారు. ఇంకా 8 కోట్ల మంది చూడని వారు ఉంటారు. అదే రోజు సినిమా రిలీజ్ చేస్తే నా సినిమాకు జనాలు రారు అని కాదు. సమస్య ఏమిటంటే లిమిటెడ్ థియేటర్స్, ఇంకా చాలా లెక్కలు ఉంటాయి... అదీ అసలు సమస్య అని విజయ్ దేవరకొండ అన్నారు.

    హాలిడేస్‌లో చేయాలని...

    హాలిడేస్‌లో చేయాలని...

    నా సినిమాను హాలిడేస్ సమయంలో విడుదల చేయాలనే థాట్ వచ్చింది. అక్టోబర్ 10 నుండి హాలిడేస్ మొదలవుతున్నాయి. పలు కారణాల వల్ల ఆ రోజున విడుదల చేయొద్దని అనుకున్నాం. ఎప్పుడు రిలీజ్ చేస్తే బావుంటుంది అని ఆడియన్స్ కు వదిలేద్దామని పోల్ పెట్టాను. తారక్ భయ్యా సినిమా రోజు నా సినిమా రావాలనే ఆలోచన లేదు. ఆ రోజు థియేటర్లు కూడా దొరకవు.... అని విజయ్ అన్నారు.

    నాన్న సినిమాలు వద్దు వ్యవసాయం చేయమన్నారు

    నాన్న సినిమాలు వద్దు వ్యవసాయం చేయమన్నారు

    నేను యాక్టర్ అవుతానని అన్నపుడు... నా డబ్బు వేస్ట్ చేయొద్దు, వ్యవసాయం చేయాలని నాన్న అన్నారు. నేను యాక్టర్ అయి చూపిస్తాను అన్నాను. తర్వాత థియేటర్ ఆర్ట్స్‌లో చేరాను అని విజయ్ దేవరకొండ గుర్తు చేసుకున్నారు.

     వారి సినిమాలు ఇష్టంగా చూస్తాను

    వారి సినిమాలు ఇష్టంగా చూస్తాను

    తమిళ సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. విఐపీ లాంటి సినిమాలు చేయాలని ఉంది. సూర్య, దనుష్, రజనీకాంత్ సినిమాలు చూస్తూ ఉంటాను అని విజయ్ దేవరకొండ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    2020 వరకు కమిట్మెంట్స్ ఉన్నాయి

    2020 వరకు కమిట్మెంట్స్ ఉన్నాయి

    ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నానని, 2020 వరకు సినిమా కమిట్మెంట్స్ ఉన్నాయి అని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ స్పస్టం చేశారు.

    English summary
    Vijay Deverakonda talks about the dynastic system of the Telugu film industry and the issue of releasing NOTA alongside NTR Jr's Aravinda Sametha Veera Raghava.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X