అమ్మాయిల్లో ఇంత శాడిజామా? విజయ్ దేవరకొండకు ఝలక్!
Recommended Video

ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం 100 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. విజయ్ నటనకు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల అమ్మాయిలతో కలిసి చేసిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను విజయ దేవరకొండ వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఇవే..

నేను ప్రభాస్ ఫ్యాన్‌ను
ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నీ యాటిట్యూబ్ చూసి ఫ్యాన్ అయిపోయాను. మీరు మాట్లాడే తెలంగాణ భాష అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా కొంచెం అందంగా ఉంటావు అని ఓ అమ్మాయి చెప్పింది.

నేను విజయ్ దేవరకొండనే
ఎవడే సుబ్రహ్మణ్యంలో రిషి.. పెళ్లిచూపుల్లో ప్రశాంత్.. అర్జున్ రెడ్డి, విజయ్ గోవింద్ పాత్రల్లో మీకు సూట్ అయ్యేది ఏది అని మరో అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆ నాలుగు పాత్రలకు నా మనస్తత్వానికి సంబంధం లేదు. నేను విజయ్ మాదిరిగానే ఉంటాను.

ఆ పాత్రలు నాకు సూట్ కావు
నేను నటించిన సినిమాల్లోని నాలుగు పాత్రలు దర్శకులు ఊహించుకొని రాసేనవి. వాటిలో లీనమై పోయి నటించడం వల్ల నేను అలానే ఉంటానని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కానీ ఆ పాత్రల్లో ఏదీ కూడా సూట్ కాదు అని విజయ్ సమాధానం ఇచ్చాడు.

సూపర్ పవర్‌స్టార్ అంటే
సూపర్ పవర్‌స్టార్ అని సోషల్ మీడియాలో పిలుస్తున్నారని.. దానికి మీ స్పందన ఏమిటని ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నకు.. విజయ్ దేవరకొండ కొంచె సిగ్గుపడిపోయాడు. ఆ ట్యాగ్‌కు ఎలా స్పందించాలో తెలియడం లేదు. కాకపోతే అలా పిలువడం హ్యాపీగానే ఉంది అని చెప్పాడు.

అమ్మాయిల్లో అంతా శాడిజమా?
గీత గోవిందం సినిమాలో రష్మికను బైక్ కూర్చోపెట్టుకొని నడిపించుకుపోయావా అనే ప్రశ్నకు.. అలాంటి అనుభవం నాకు ఎదురు కాలేదు. కాకపోతే అమ్మాయిలను బైక్‌పైన తీసుకెళ్లాను అని విజయ్ దేవరకొండ తెలిపారు. అబ్బాయిలను హింసించే శాడిజం అమ్మాయిల్లో చాలానే ఉందే అని అన్నారు. మేడమ్ అంటూ నేను బతిమాలిన ప్రతీసారి థియేటర్లలో అమ్మాయిలు చప్పట్లు కొడుతున్నారనే విషయం తెలిసింది అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











