లైఫ్ ఎఫెక్ట్ అయినా నా కోసం రష్మిక ఎన్నో మాటలు పడింది.. ఆరోజు మీకే తెలుస్తుంది.. విజయ్ ఆవేదన
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా తాజాగా నటించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. గత సంవత్సరం వచ్చిన సూపర్ హిట్ సినిమా 'గీత గోవిందం' తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే, ఈ జంటపై చాలా రూమర్స్ వస్తున్నాయి. దీని గురించి అటు విజయ్.. ఇటు రష్మిక ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా అవి ఆగడం లేదు. దీంతో వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీనిపై మరోసారి స్పందించాడు విజయ్.
నాకు బ్యాగ్రౌండ్ ఉంది
విజయ్ దేవరకొండ తన స్పీచ్ మొదలు పెడుతూ.. ‘‘తెలుగు ప్రజలారా.. వైజాగ్.. నేను ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చానని అంటున్నారు. నాకెందుకు బ్యాగ్రౌండ్ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల మంది.. పక్క రాష్ట్రాల్లో వేల మంది ఉన్నారు. మీరంతా ఉండగా నాకు బ్యాగ్రౌండ్ లేదని ఎలా చెబుతాను'' అని అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడాడు.

డియర్ లిల్లీతోనే మొదలు పెడతా
ఇక, సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నాలుగు రాష్ట్రాల్లో సినిమాకు సంబంధించిన ఫంక్షన్లు చేశాం. కానీ, సినిమా గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఫస్ట్ టైమ్ వైజాగ్‌లో మాట్లాడుతున్నాం. దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను మా డియర్ లిల్లీతోనే మొదలుపెడుతా. ఈ సినిమాకు మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్.. ఈ సినిమాకు ప్రాణం.. ప్రతి అమ్మాయి క్యారెక్టర్ లిల్లీ.. మా సినిమాలో మీకు గుర్తుండేది లిల్లీ'' అని స్టార్ట్ చేశాడు.

ఎంతో మందిని అనుకున్నాం
లిల్లీ పాత్ర కోసం మొదట ఎంతో మందిని అనుకున్నామని విజయ్ చెప్పాడు. ‘‘మొదట ఈ క్యారెక్టర్‌కు భరత్ చెప్పినట్లు చాలా వెతికాం. కానీ, రష్మిక ఈ పాత్రను ఒప్పుకున్న తర్వాత తను పడిన కష్టం, ఈ సినిమాకు చేసిన కష్టం ఎంతనో నాకు తెలుసు'' అని చెప్పుకొచ్చాడు.

నాతో సినిమా కోసం ఎన్నో మాటలు పడింది
ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత రష్మిక పడిన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ ‘‘ఈ సినిమా గురించి పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయినా చేసింది. జనాలు ఏమన్నా చేసింది. నాతో రెండో సినిమా చేసినందుకు ఎన్నో మాటలు పడింది. కానీ, లిల్లీ అనే క్యారెక్టర్ గురించి ప్రాణం పెట్టింది'' అని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆరోజు మీకే తెలుస్తుంది
ఈ సినిమా కోసం రష్మిక ఎంతో కష్టపడిందని చెబుతూ.. ‘‘ఈ సినిమాకు మాకు ఎంతో స్పెషల్. అందుకు ఎంతో కష్టపడ్డందుకు థ్యాంక్స్ రష్మిక. యు డన్ ఏ గుడ్ జాబ్. జూలై 26న మీరందరూ రష్మిక కష్టాన్ని మెచ్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. ప్రేమిస్తారు'' అని విజయ్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











