twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సావురా.. సావు.. వీడు ఎప్పుడు సస్తాడో.. విజయ్ దేవరకొండ ఫన్నీ స్పీచ్

    |

    Recommended Video

    Vijay Devarakonda Funny Speech @ Terminator Dark Fate Telugu Trailer Launch

    హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన టర్మినేటర్: డార్క్ ఫేట్ చిత్రం నవంబర్ 1 రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. హాలీవుడ్ ప్రముఖుడు జేమ్స్ కామెరాన్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

    నాకు బాల్యం గుర్తొచ్చింది..

    నాకు బాల్యం గుర్తొచ్చింది..

    టర్మినేటర్: డార్క్ ఫేట్ చిత్రం ట్రైలర్ బాగుంది. టెక్నికల్‌గా చాలా అద్భుతంగా ఉంది. స్కూల్‌లో ఉన్నప్పుడు జేమ్స్ కామెరాన్ సినిమాలు చూశాను. టైటానిక్, అవతార్, టర్మినేటర్ సిరిస్‌లు చూసి థ్రిల్ అయ్యాం. ఆయన సినిమాలో టెక్నికల్ బ్రిల్లియెన్స్ మాటల్లో చెప్పలేం. టెర్మినెటర్ సినిమా గుర్తొస్తే నాకు మళ్లీ బాల్యం గుర్తుకు వస్తుంది అని విజయ్ దేవరకొండ అన్నారు.

     విలన్‌ను చూసి మేము

    విలన్‌ను చూసి మేము

    నా చిన్నతనంలో టర్మినేటర్ సినిమా చూశాను. నేను టర్మినేటర్ జడ్జిమెంట్ చూశాను. ఆ సినిమాలో విలన్‌ను పోలీస్ ఆఫీసర్ ఎంత కాల్చినా వస్తూనే ఉంటాడు. పోలీస్ ఆఫీసర్‌ను వెంటాడుతుండే ఆ విలన్ చూసి తట్టుకోలేక సావురా.. సావురా.. వీడు ఎప్పుడు సస్తాడో అనే అంటూ మొత్తుకొనేవాళ్లం. పిల్లలుగా మా పరిస్థితి అది. ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేం. మళ్లీ నాకు బాల్యం గుర్తొచ్చింది. ఇప్పుడు టెర్మినేటర్: డార్క్ ఫేట్ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది.

    డబ్బింగ్‌తో పిచ్చి లేసింది..

    డబ్బింగ్‌తో పిచ్చి లేసింది..

    టెర్మినేటర్: జడ్జిమెంటల్ డే సినిమా తర్వాత నాకు బాగా నచ్చిన ట్రైలర్ టర్మినేటర్: డార్క్ ఫేట్ మాత్రమే. టెర్మినేటర్ సిరీస్లో ఇది ఐదోవది. హాలీవుడ్ డబ్బింగ్ సినిమా 300 చూశాను. ఎక్కువగా నేను ఇంగ్లీష్ వెర్షన్ చూసేవాడిని. నా ఫ్రెండ్ కోసం తెలుగు డబ్బింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు డబ్బింగ్ చూస్తే చికాకు కలిగింది అని విజయ్ దేవరకొండ అన్నారు.

    ఘన విజయం సాధించాలని

    ఘన విజయం సాధించాలని

    టెర్మినేటర్ సిరీస్‌ చిత్రాలు సాధించినట్టే టెర్మినేటర్: డార్క్ ఫేట్ సినిమా కూడా కలెక్షన్లపరంగా ఘన విజయం సాధించాలి. బిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టాలని కోరుకొంటున్నాను. హాలీవుడ్ సినిమాలు మాచేత ప్రమోషన్ చేపిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సినిమాలను కూడా హాలీవుడ్‌లో ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలి. డిస్నీ కంపెనీ వాళ్లు వాళ్ల టెక్నాలజీని టాలీవుడ్‌కు అందించాలి అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

     ఆర్నాల్డ్ చేత నా సినిమా ప్రమోషన్

    ఆర్నాల్డ్ చేత నా సినిమా ప్రమోషన్

    టాలీవుడ్ సినిమాలను ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేసి అక్కడ కూడా ప్రమోట్ చేయాలి. సైరా, సాహో లాంటి సినిమాలు రూపొందితే ఇంగ్లీష్‌లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలి. ఏదో ఒకరోజు తెలుగు సినిమాలు అక్కడ ప్రమోట్ చేయాలి. ఆర్నాల్డ్ చేత విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూడమని ప్రచారం చేయించాలి అని విజయ్ దేవరకొండ ఫన్నీగా మాట్లాడారు.

    English summary
    Tollywood Sensation Vijay Deverakonda released Terminator: Dark Fate Telugu Version trailer. He said, Terminator brings my childhood back. He cherished his memories once again in this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X