కబీర్ సింగ్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ.. నా డైరక్టర్‌కు ఫుల్ పవర్స్!
అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ రూపంలో సంచలన హీరో అవతరించాడు. విజయ్ దేవరకొండ సంచలనాలు అర్జున్ రెడ్డి చిత్రంతో ముగిసిపోలేదు. గీత గోవిందం చిత్రంతో విజయ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అర్జున్ రెడ్డి చిత్రంలో నటుడుగా తన ప్రతిభ నిరూపించుకునే అద్భుత అవకాశం దక్కించుకున్న విజయ్ చెలరేగిపోయాడు. వ్యసనపరుడైన డాక్టర్ పాత్రలో విజయ్ దేవరకొండ తన పెర్ఫామెన్స్ తో అందరిని మంత్ర ముగ్దుల్ని చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రం ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో రీమేక్ అవుతోంది. హిందీ రీమేక్ కు కబీర్ సింగ్ అనే టైటిల్ ఖారారు చేసిన సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందించాడు.

తెలుగులో అర్జున్ రెడ్డి.. హిందీలో కబీర్ సింగ్
హిందీ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రానికి కబీర్ సింగ్ అనే టైటిల్ ఖరారు చేశారు. స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ వంగ హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తుండడం విశేషం.
అర్జున్ రెడ్డి విషెష్
కబీర్ సింగ్ టైటిల్ పై విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు. కబీర్ సింగ్ కు అర్జున రెడ్డి బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నాడు. నా దర్శకుడు సందీప్ వంగకు మరింత శక్తి చేకూరాలి అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.

దేశం మొత్తం సంచలనం
తెలుగులో చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి సాధించిన విజయం అలాంటి ఇలాంటి వవిజయం కాదు. దేశంలోని సినీప్రముఖులంతా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. బోల్డ్ కంటెంట్ కు ఎమోషన్ ని జత చేసిన సందీప్ వంగా తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం ఖాతాలో వేసుకున్నాడు.

ఎగబడి మరీ
అర్జున్ రెడ్డి విజయం తరువాత ఈ చిత్ర రీమేక్ కోసం తమిళ, హిందీ నిర్మాతలు ఎగబడ్డారు. చిత్ర కథ అద్భుతంగా ఉండడంతో రీమేక్ లో నటించాలని షాహిద్ కపూర్ డిసైడ్ అయ్యాడు. తన కుమారుడిని నిదానంగా లాంచ్ చేద్దాంలే అని అప్పటివరకు అనుకుంటున్న విక్రమ్ అర్జున్ రెడ్డి చిత్రంతో అలెర్ట్ అయ్యాడు. వెంటనే ధృవ్ ని రంగంలోకి దించాడు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రం వర్మ పేరుతో రీమేక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











