దూసుకెళుతున్న విజయ్ దేవరకొండ... కొత్త మూవీ ‘డియర్ కామ్రేడ్’ షురూ!
'పెళ్లి చూపులు' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి'తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో 'టాక్సీవాలా' సినిమా చేసే అవకాశం దక్కించుకున్న విజయ్ దీంతో పాటు 'నోటా', 'గీతా గోవిందం' లాంటి చిత్రాలకు కమిట్ అయ్యాడు. విజయ్ నటిస్తున్న మరో కొత్త చిత్రం 'డియర్ కామ్రేడ్' సోమవారం ప్రారంభం అయింది. దర్శకుడు సుకుమార్, కొరటాల శివ, చంద్రశేఖర్ ఏలేటి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డియర్ కామ్రేడ్
తొలి సన్నివేశానికి ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా, డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. సుకుమార్, కొరటాల శివ స్క్రిప్ట్ అందించారు.

మైత్రి మూవీ మేకర్స్
శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారు బిగ్ బెన్ బ్యానర్స్‌తో కలిసి ‘డియర్ కామ్రేడ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు.

విజయ్, రష్మిక
విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి జై కృష్ణ మాటలు రాస్తున్నారు. రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

తెరముందు, తెరవెనక
నటీనటులు:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సాంకేతిక నిపుణులు:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: భరత్ కమ్మ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్, బిగ్ బెన్ సినిమాస్
నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి(సి.వి.ఎం), యస్ రంగినేని
సి.ఈ.ఓ: చెర్రి
కో ప్రొడ్యూసర్: ప్రవీణ్ మర్పురి
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
కెమెరామెన్: సుజిత్ సరంగ్
ఎడిటర్: శ్రీజిత్ సరంగ్
డైలాగ్స్ : జై కుమార్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు


Click it and Unblock the Notifications











