ఫిల్మ్‌ఫేర్ అవార్డును వేలం వేయడాని సిద్ధమైన విజయ్ దేవరకొండ, కేటీఆర్ ఫిదా!

By Bojja Kumar

Recommended Video

Vijay Deverakonda Auction His First Filmfare Award

ఫిల్మ్ ఫేర్స్ అవార్డ్ అందుకున్న నటుడు విజయ్ దేవరకొండను తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలతో ముంచెత్తారు. తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. అవకాశం ఉంటే ఈ అవార్డును వేలం వేసి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తానంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఫిదా అయ్యారు.

'అర్జున్ రెడ్డి' చిత్రంలో నటనకుగాను 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి దిగ్గజాలు రేసులో ఉండగా.... విజయ్ దేవరకొండ అందరినీ వెనక్కి నెట్టి ఈ అవార్డు అందుకున్నారు.

ఉత్తమ నటుడు అవార్డుతో విజయ్

కెరీర్లో తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, అందులోనూ ఉత్తమ నటుడు కేటగిరీలో అందుకోవడంపై విజయ్ దేవరకొండ చాలా సంతోషంగా ఉన్నారు. అవార్డు అందుకున్న అనంతరం దాంతో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

గెలుపు కొత్తకాదు, ఈ అవార్డు బోనస్

గెలుపు కొత్తకాదు, ఈ అవార్డు బోనస్

నా వరకు నేను యాక్టర్ అవ్వడమే పెద్ద గెలుపు. ఇండస్ట్రీ రెస్పెక్ట్, డబ్బులు ఇచ్చినపుడు మరోసారి గెలిచినట్లు అనిపించింది. మమ్మీ డాడీకి సొంతిల్లు కొన్నపుడు ఇంకోసారి గెలిచినట్లు అనిపించింది. అభిమానులను సొంతం చేసుకున్నపుడు మరోసారి గెలిచినట్లు అనిపించింది. ఈ అవార్డు నాకు బోనస్ లాంటిది. ఈ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇవ్వడానికి సిద్ధమే... వారు తీసుకోవడానికి అంగీకరిస్తే రేపు వెళ్లి ఇచ్చేస్తాను. ఇది నా సెల్ఫ్ మీద ఉండటం కంటే నేను పుట్టిన సిటీ కోసం ఉపయోగపడితే బావుంటుంది.

వేలం వేయడానికి సిద్ధపడ్డ విజయ్


రోజూ ట్విట్టర్లో చూస్తూ ఉంటా. ఎంతో మంది సహాయం అడిగితే కేటీఆర్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సహాయం చేస్తుంటారు. అలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఈ అవార్డును వేలం వేయడానికి సిద్ధమే అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ చూసి కేటీఆర్ ఫిదా అయిపోయారు.

విజయ్ దేవరకొండ మూవీస్

విజయ్ దేవరకొండ మూవీస్

‘అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్డ్స్ బేనర్లో ‘టాక్సావాలా' మూవీతో పాటు ‘నోటా', ‘డియర్ కామ్రేడ్' చిత్రాలు చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X