For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సగం బిల్లు నాదే.. విజయ్ దేవరకొండ.. అన్న దారిలో ఆనంద్ దేవరకొండ

    |

    మిడిల్ క్లాస్ మెలోడీస్ అందించిన విజయంతో టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఓ వైపు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టారు. తన సోదరుడు విజయ్ దేవరకొండను స్ఫూర్తిగా తీసుకొని బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినట్టు కనిపిస్తున్నది. ఇంతకు ఆనంద్ ఏ వ్యాపారంలోకి ప్రవేశించారంటే..

    రౌడీ బ్రాండ్‌తో విజయ్ దేవరకొండ

    రౌడీ బ్రాండ్‌తో విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో రౌడీ బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించారు. అలాగే ఇటీవల విద్యుత్ ఆధారంగా నడిచే వాహన తయారీ రంగంలో భాగస్వామి అయ్యారు. ఇలా అన్నయ్య వేస్తున్న అడుగుల్లోనే ఆనంద్ దేవరకొండ అడుగు వేస్తూ ఫుడ్ బిజినెస్‌లోకి ప్రవేశించారు.

    వ్యాపార రంగంలోకి ఆనంద్ దేవరకొండ

    వ్యాపార రంగంలోకి ఆనంద్ దేవరకొండ

    మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆనంద్ దేవరకొండ తన స్నేహితులు నిర్వహిస్తున్న గుడ్ వైబ్స్ ఓన్లీ (Good Vibes only) కేఫ్‌లో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఖాజాగూడలో ఇప్పటికే ఈ కేఫ్ ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నది. తాను వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయాన్ని ఆనంద్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

    ఫుడ్ బేస్ట్ మూవీస్‌తోనే సక్సెస్

    ఫుడ్ బేస్ట్ మూవీస్‌తోనే సక్సెస్

    గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌లో భాగస్వామి అయ్యానని ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేస్తూ....నేను మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్‌తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. మిడిల్ క్లాస్ మెలొడీస్ ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్‌ను ఈ ఫుడ్ బిజినెస్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా స్నేహితులు కలిసి నిర్వహిస్తున్న గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌లో భాగస్వామి అవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు రండి అంటూ విజయ్ ట్వీట్

    గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు రండి అంటూ విజయ్ ట్వీట్

    తన సోదరుడి బిజినెస్ ప్లాన్స్‌పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ... మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ హిట్ కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నా సోదరుడి విజయానందాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. అందుకే శని, ఆదివారం ( నవంబర్ 28, 29 తేదీలలో) గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు రండి. మీరు చేసే బిల్లులో నేను సగం బిల్ చెల్లిస్తాను. సో మీ అందరికీ వెల్ కమ్. బిల్ నాది" అని విజయ్ ట్వీట్ చేశారు.

    Rahul Sipligunj New Look Shocks His Fans
    మిడిల్ క్లాస్ మెలోడీస్‌ ఘన విజయం

    మిడిల్ క్లాస్ మెలోడీస్‌ ఘన విజయం

    ఇదిలా ఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నవంబర్ 20వ తేదీన రిలీజైన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం ఘన విజయాన్ని అందుకొన్నది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి బ్రహ్మండమైన రెస్సాన్స్ వస్తున్నది.

    English summary
    Hero Vijay Deverakonda’s brother Anand is on cloud nine with a good reception to his second film ‘Middle Class Melodies.’ Not just this Anand received his first paycheck for the film and guess what he made an investment with his first remuneration. Anand along with his friends opened up a café in Hyderabad and it is named ‘Good Vibes Only.’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X