Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సగం బిల్లు నాదే.. విజయ్ దేవరకొండ.. అన్న దారిలో ఆనంద్ దేవరకొండ
మిడిల్ క్లాస్ మెలోడీస్ అందించిన విజయంతో టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఓ వైపు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టారు. తన సోదరుడు విజయ్ దేవరకొండను స్ఫూర్తిగా తీసుకొని బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టినట్టు కనిపిస్తున్నది. ఇంతకు ఆనంద్ ఏ వ్యాపారంలోకి ప్రవేశించారంటే..
రౌడీ బ్రాండ్‌తో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో రౌడీ బ్రాండ్‌తో ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించారు. అలాగే ఇటీవల విద్యుత్ ఆధారంగా నడిచే వాహన తయారీ రంగంలో భాగస్వామి అయ్యారు. ఇలా అన్నయ్య వేస్తున్న అడుగుల్లోనే ఆనంద్ దేవరకొండ అడుగు వేస్తూ ఫుడ్ బిజినెస్‌లోకి ప్రవేశించారు.
వ్యాపార రంగంలోకి ఆనంద్ దేవరకొండ
మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆనంద్ దేవరకొండ తన స్నేహితులు నిర్వహిస్తున్న గుడ్ వైబ్స్ ఓన్లీ (Good Vibes only) కేఫ్‌లో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్ నగరంలోని ఖాజాగూడలో ఇప్పటికే ఈ కేఫ్ ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నది. తాను వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయాన్ని ఆనంద్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
ఫుడ్ బేస్ట్ మూవీస్‌తోనే సక్సెస్
గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌లో భాగస్వామి అయ్యానని ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేస్తూ....నేను మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్‌తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. మిడిల్ క్లాస్ మెలొడీస్ ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్‌ను ఈ ఫుడ్ బిజినెస్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా స్నేహితులు కలిసి నిర్వహిస్తున్న గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌లో భాగస్వామి అవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నాం అని ట్వీట్లో పేర్కొన్నారు.
గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు రండి అంటూ విజయ్ ట్వీట్
తన సోదరుడి బిజినెస్ ప్లాన్స్‌పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ... మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ హిట్ కావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నా సోదరుడి విజయానందాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నా. అందుకే శని, ఆదివారం ( నవంబర్ 28, 29 తేదీలలో) గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు రండి. మీరు చేసే బిల్లులో నేను సగం బిల్ చెల్లిస్తాను. సో మీ అందరికీ వెల్ కమ్. బిల్ నాది" అని విజయ్ ట్వీట్ చేశారు.
Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ ఘన విజయం
ఇదిలా ఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నవంబర్ 20వ తేదీన రిలీజైన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం ఘన విజయాన్ని అందుకొన్నది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి బ్రహ్మండమైన రెస్సాన్స్ వస్తున్నది.