హీరోపై డౌట్ పెట్టుకోకండి.. పక్కా! క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ

ప్రస్తుతం టాలీవుడ్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హవా నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ పక్కా ప్లాన్ ప్రకారం సాగిపోతున్నాడు ఈ రౌడీ స్టార్. ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో కాస్త డీలా పడినా, కుర్రాడిలో జోష్ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి 'మీకు మాత్రమే చెప్తా' అంటూ చెప్పాల్సిందంతా చెప్పేశాడు.

ఇంతకీ విషయమేంటి? అంటారా.. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'హీరో' అనే టైటిల్ ఫిక్స్ చేసి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తిచేశారు. కానీ అనుకోకుండా సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఇక ఈ సినిమా షూటింగ్ జరగదు.. కంప్లీట్‌గా ఆగిపోయినట్లే అనే రూమర్స్ వినిపించాయి. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ దేవరకొండ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Vijay Deverakonda Clarity On Hero

'హీరో' సినిమా ఆగిపోలేదు.. ఈ విషయంలో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. ప్రస్తుతం రెండవ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయనున్న ప్రాజెక్టు ఫినిష్ అయ్యాకే 'హీరో' సినిమా పూర్తవుతుంది. అని చెప్పేశాడు విజయ్ దేవరకొండ. దీంతో ఇన్నాళ్లు వచ్చిన రూమర్స్ అన్నింటికీ ఫుల్‌స్టాప్ పడింది.

మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోనూ నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన లుక్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. సో మన 'వరల్డ్ ఫేమస్ లవర్' హీరో అయ్యేందుకు కూడా సిద్దంగానే ఉన్నాడన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X