F**k.. అది వింటేనే అదోలా అంటూ.. రష్మికతో లిప్‌లాక్‌పై విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్ హీరో స్థాయి క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. తెలుగు సినిమా రౌడీ స్టార్ గా పిలవబడుతున్న ఈ హీరో సినిమా అంటేనే యూత్ ఆడియన్స్ ఊగిపోతుంటారు. అందుకు కారణం విజయ్ దేవరకొండ పర్‌ఫార్‌మెన్స్ ఓ కారణమైతే, ఈయన సినిమాల్లో ఉండే లిప్‌లాక్ సన్నివేశాలు మరో కారణం. గతంలో గీత గోవిందం సినిమాలో రష్మికతో చేసిన లిప్‌లాక్స్ ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండ తాజా సినిమా 'డియర్ కామ్రేడ్' లోనూ లిప్‌లాక్ సీన్స్ అదిరిపోతాయని ట్రైలర్ ద్వారా చెప్పేసింది చిత్రయూనిట్. దీంతో మరోసారి టాలీవుడ్ జనాల చూపు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న లిప్‌లాక్స్‌పై పడింది. అయితే తాజాగా దీనిపై ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా స్పందించాడు. వివరాల్లోకి పోతే..

డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్.. బెంగుళూరులో టీమ్

డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్.. బెంగుళూరులో టీమ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఈ నెల 26వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న సందర్బంగా తాజాగా బెంగుళూరులో పర్యటించి డియర్ కామ్రేడ్ ప్రమోషన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్న, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

రష్మికతో ముద్దు సీన్లపై ప్రశ్నల వర్షం

రష్మికతో ముద్దు సీన్లపై ప్రశ్నల వర్షం

క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న కనిపించారంటే చాలు ముద్దు సీన్లపై ప్రశ్నల వర్షం కురవడం కామన్ అయిపోయింది. తాజాగా బెంగుళూరు లోనూ ఇదే జరిగింది. అక్కడి మీడియా సమావేశంలో రష్మికతో ముద్దు సీన్లపై మీ అభిప్రాయమేంటి? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై ఆసక్తికరంగా స్పందించిన విజయ్ దేవరకొండ లిప్‌లాక్ అనే మాట వింటేనే తనకు అదోలా అనిపిస్తుందని సమాధానమిచ్చాడు.

లిప్‌లాక్ అంటేనే.. అది కూడా ఓ భాగమే

లిప్‌లాక్ అంటేనే.. అది కూడా ఓ భాగమే

తనకు లిప్‌లాక్ అనే మాటే నచ్చదని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ముద్దు అనేది మినిషి లోని సహజసిద్ధమైన ఎమోషన్. కోపం, బాధ, ప్రేమ ఎలాంటివో ముద్దు కూడా అలాటిందే. దాన్ని లిప్ లాక్ అని ఎందుకంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేను లిప్‌లాక్ అనే పదం చదివానంటే దాన్ని ఫక్ అని అర్థం చేసుకుంటాను.. అని పేర్కొంటూ దాన్ని పెద్దది చేసి చూడొద్దని చెప్పాడు విజయ్ దేవరకొండ.

రెండు పాత్రల మధ్య రిలేషన్‌షిప్.. కథ డిమాండ్ చేసింది కాబట్టే

రెండు పాత్రల మధ్య రిలేషన్‌షిప్.. కథ డిమాండ్ చేసింది కాబట్టే

ముద్దు సీన్ అనేది కథ లోని రెండు పాత్రల మధ్య రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది తెలుపుతుంది తప్ప మరోటి కాదు. కిస్ సీన్స్ చేస్తున్నపుడు నేను విజయ్ దేవరకొండ అని, ఆమె రష్మిక మందన్న అని ఫీల్ కాలేదు.. కేవలం బేబీ, లిల్లి (డియర్ కామ్రేడ్ పాత్రల పేర్లు) గా మాత్రమే ఆ సీన్స్ చేశాము. పైగా కథ డిమాండ్ చేసింది కాబట్టి ఆ సీన్స్ అవసరం.. అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

డియర్ కామ్రేడ్ మూవీ

డియర్ కామ్రేడ్ మూవీ

భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' మూవీ తెరకెక్కింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. జులై 26 వ తేదీన డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X