రాజమౌళి ప్రయత్నాలు విఫలం.. విజయ్ దేవరకొండ మాత్రం సక్సెస్.. రాఖీ భాయ్ మహిమే కారణం

భారతదేశ సినీ చరిత్రలో 'బాహుబలి' సృష్టించిన రికార్డు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇండియన్ సినిమాపై ఇంతటి ప్రభావం చూపిన ఈ సినిమా ఓ లోటు మాత్రం పూడ్చుకోలేపోయింది. అదే.. కన్నడంలో విడుదల కాకపోవడం. దేశ వ్యాప్తంగా 'బాహుబలి' ఎన్నో భాషల్లో విడుదలైంది. కానీ, కన్నడంలో మాత్రం సాధ్యం కాలేదు.

రాజమౌళి ప్రయత్నించినా..

రాజమౌళి ప్రయత్నించినా..

కన్నడంలో తెలుగు సినిమాలను డబ్బింగ్ చేయకూడదన్న నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. ‘బాహుబలి'ని ఆ భాషలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ, అక్కడి దర్శక, నిర్మాతలు దీనికి అంగీకారం తెలుపలేదు. దీంతో కన్నడ భాషలో ఆ సినిమా విడుదల కాలేదు. ఇది కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.

కేజీఎఫ్‌తో మారిన సీన్

కేజీఎఫ్‌తో మారిన సీన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘కేజీఎఫ్' చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా స్ట్రైయిట్ మూవీగా విడుదలైంది. ఇక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడంతో, తెలుగు సినిమాలపై నిషేదాన్ని కన్నడ చిత్ర సీమ ఎత్తి వేసింది. దీంతో ఇప్పుడు మన సినిమాలు కన్నడ భాషలోనూ రిలీజ్ అవ్వొచ్చు.

రంగస్థలంతో మొదలు

రంగస్థలంతో మొదలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకి మైలురాయిగా నిలిచిన చిత్రం ‘రంగస్థలం'. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా కన్నడంలో ‘రంగస్థల' పేరుతో డబ్ అయ్యింది. ‘మయా బజార్' సినిమా తర్వాత కన్నడంలో డబ్ అయిన సినిమాగా ‘రంగస్థలం' నిలిచింది.

విజయ్ దేవరకొండ లక్

విజయ్ దేవరకొండ లక్

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో విజయ్ అండ్ కో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముగించేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X