Vijay Devarakonda: రచ్చ లేపాడుగా...ఒకే రోజున రెండు రికార్డులు!
నువ్విలా సినిమాతో ఎంట్రీ ఇచ్చి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పేరు తెచ్చుకుని రౌడీ హీరోగా మారిపోయిన ఆయన ఒకే రోజు రెండు క్రేజీ రికార్డులు బద్దలు కొట్టారు ఆయన. ఆ వివరాల్లోకి వెళితే

చివరిగా
చివరగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ప్రేక్షకులలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. సినిమా పరంగా బానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా మొదలు పెట్టాడు.

లైగర్ తో బిజీ
అప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఒక బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఈ షూటింగ్ మొదలు కాలేదు కానీ త్వరలోనే మొదలు కానున్న ఆ షూట్ లో జాయిన్ అవుతాడు.

ఫేస్ బుక్ లో మైలురాయి
సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్న విజయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రికార్డును సాధించాడు. ఆయన ఫేస్‌బుక్‌లో 10 మిలియన్ ఫాలోవర్ల అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ రేంజ్ ఫాలోవర్స్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో విజయ్ కూడా ఒకరిగా చేరారు. ఇక ఆయన మూడో ఏడాది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
Recommended Video


హలో లిస్టులో
ఇక ఆయన హలో లిస్టులో కూడా స్థానం సంపాదించాడు. ప్రతి ఏడాది అనేక విభాగాల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో చోటు దక్కుతుంది. ఇక విజయ్ దేవరకొండ చిన్ననాటి నుండి అభిమానించే హీరో మహేష్ బాబుతో ఈ పవర్ లిస్టులో చోటు దక్కించుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు.

లైగర్ విషయానికి వస్తే
ఇక విజయ్ నటిస్తున్న లైగర్ విషయానికి వస్తే ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల కానున్నట్లు ప్రకటించారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల అనేది కష్టమే అని చెప్పవచ్చు. ఇక విజయ్ ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











