Telangana Elections & Voting జీవితాలు బాగుపడాలంటే ఆ పార్టీకే ఓటు వేయండి.. యూత్‌కు విజయ్ దేవరకొండ పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రంజుగా సాగుతున్నది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వరకు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. 51.89 శాతం నమోదైంది. ఇంకా పోలింగ్ బూతుల వద్ద భారీగా ఓటర్లు క్యూ కనిపిస్తున్నది. అయితే తాజా పోలింగ్‌కు సినీ ప్రముఖుల నుంచి భారీ స్పందన లభిస్తున్నది. ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకొన్న అనంతరం రౌడీ స్టార్ ది విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

Recommended Video

స్పెషల్ డ్రెస్ లో Vijay Devarakonda..ఓటెయ్యండి రౌడీస్ అంటూ .. Telangana Elections | Telugu Oneindia

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వినియోగించుకొనేందుకు స్టార్ హీరోలు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. ఉదయం 7 గంటల సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు దంపతులు, రాజశేఖర్ దంపతులు, హీరో రామ్ పోతినేని, గోపిచంద్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

Vijay Deverakonda exercised vote in Telangana Elections 2023: Requeste Vote for Development

హీరో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులు, టీమ్ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మనమందరం ఓటు హక్కు సమర్పించుకోవాలి. మన భవిష్యత్ కోసం ఓటు తప్పకుండా వేయాలి. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందనే విషయం అందరికి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని, తమకు నచ్చిన నేతలకు ఓటు వేయాలి అని విజయ్ దేవరకొండ తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త సిటీ డెవలప్ అయింది. నీళ్లు వచ్చాయి.విద్యుత్ సరఫరా మెరుగుపడింది. ఇవన్నీ రాజకీయ నేతల వల్లే సాధ్యపడింది. ఓటు వేయడం వల్లే మన జీవితాలపై మంచి ప్రభావం పడింది. మీ ఇష్టమైన పార్టీకి ఓటు వేసి మంచి జరిగేలా చూసుకోవాలి. మన జీవితాలు బాగుపడాలంటే ఓటు వేయాల్సిందే అని విజయ్ దేవరకొండ అన్నారు.

Vijay Deverakonda exercised vote in Telangana Elections 2023: Requeste Vote for Development

మన జీవన విధానం బాగుపడాలంటే.. అభివృద్ది కొనసాగాలంటే.. రోడ్లు బాగుపడాలంటే.. ఎలక్ట్రిసిటీ బాగుండాలనే ఉద్దేశంతో నేను, నా కుటుంబంతో కలిసి ఓటు వేశాను. మీరు కూడా అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వల్లే మన జీవితాలు బాగుపడుతాయి అని విజయ్ దేవరకొండ చెప్పారు.

దేశం కోసం యూత్ ముందుకు రావాలి. అత్యధిక శాతం ఉన్న యూత్ ముందుకొచ్చి ఓటు వేయాలి. ఓటు వేయడమనేది తప్పనిసరి. కాబట్టి యువతీ, యువకులు తప్పనిసరిగా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అని విజయ్ దేవరకొండ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X