విజయ్ దేవరకొండ ఫంక్షన్‌లో యువకుడి హల్‌చల్.. ఎటాక్ చేయడానికి వచ్చావా అంటూ..

Recommended Video

Vijay Deverakonda Fan Hulchal In Dear Comrade Pre Release Event || Filmibeat Telugu

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా అతడి ఫాలోయింగ్ మామూలుగా ఉండడం లేదు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్న ఈ యంగ్ హీరో.. 'గీత గోవిందం'తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పుడు 'డియర్ కామ్రేడ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖపట్నంలో జరిగింది. ఈ ఫంక్షన్‌లో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు.

యువకుడి హల్‌చల్

ఈ ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతున్న సమయంలో సెక్యూరిటీ, బౌన్సర్లను దాటుకుని ఓ యువకుడు స్టేజ్‌పైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతేకాదు, వచ్చిన వెంటనే విజయ్ కాళ్లపై పడిపోయాడు. దీంతో పక్కన ఉన్న వారు వెంటనే స్పందించి విజయ్‌ను పట్టుకోవడంతో కింద పడకుండా ఆగిపోయాడు. లేకుంటే ఈ యంగ్ హీరో కింద పడిపోయేవాడు. ఈ ఘటనతో అంతా షాక్ అయ్యారు.

ప్రేమతో వచ్చావా..? ఎటాక్ చేయడానికా.?

ప్రేమతో వచ్చావా..? ఎటాక్ చేయడానికా.?

ఆ యువకుడు వచ్చి రెండు కాళ్లు గట్టిగా పట్టుకోవడంతో ఇబ్బంది పడ్డ విజయ్.. ఆ తర్వాత అతడి గురించి మాట్లాడాడు. ‘‘ఏమిరా..? ప్రేమతో వచ్చినవా..? ఎటాక్ చేయడానికి వచ్చావా..?'' అంటూ అనగానే ఫంక్షన్‌లో ఉన్న వారంతా గట్టిగా కేకలు పెట్టారు. దీంతో వాతావరణం అంతా కూల్ అయిపోయింది.

వదిలేయండి.. చోడ్‌దో ఉస్‌కో

వదిలేయండి.. చోడ్‌దో ఉస్‌కో

ఈ ఘటన తర్వాత విజయ్ మాట్లాడడం కొనసాగించాడు. అయితే, ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా గోల చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏమైందా అని చూసిన విజయ్‌కు.. ఆ యువకుడిని తన సెక్యూరిటీ ఇబ్బంది పెట్టడం కనిపించింది. దీంతో వెంటనే ‘‘హేయ్ బాబీ.. వదిలేయండి వాడిని. చోడ్‌దో ఉస్‌కో. ఒరేయ్.. నువ్వు కామ్‌గా వెళ్లిపోరా.. ఉరుకులు పెట్టకు'' అంటూ పంపించేశాడు. ఇక అక్కడి నుంచి అతడు తన ప్రసంగాన్ని కొనసాగించాడు.

‘డియర్ కామ్రేడ్' గురించి

‘డియర్ కామ్రేడ్' గురించి

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అవుతోంది.

సెన్సార్ రిపోర్ట్

సెన్సార్ రిపోర్ట్

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఈ సినిమా రన్‌ టైమ్ 2 గంటల 49 నిమిషాలు ఉంది. గతంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి' కూడా దాదాపు మూడు గంటల రన్ టైమ్ ఉంది. లాంగ్ రన్ టైమ్ ఉన్నప్పటికీ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్' కూడా అలాంటి మేజిక్‌నే క్రియేట్ చేస్తుందేమోనన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X