Vijay Deverakonda 6 కోట్ల నష్టాన్ని ఇచ్చేయ్.. ప్రముఖ నిర్మాత ట్వీట్.. అర్జున్ రెడ్డి లాభాలు తిరిగి ఇస్తారా?
రౌడీ స్టార్ ది విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. ఖుషి సాధిస్తున్న కలెక్షన్లతో తన సక్సెస్‌ను అభిమానులతో పంచుకొంటున్నారు. థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులు, ఫ్యాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకోవడం, అలాగే వైజాగ్‌లో సక్సెస్ మీట్‌తో జనానికి చేరువయ్యే ప్రయత్నం చేశాడు. అయితే ఖుషి బ్లాక్ బస్టర్ విజయం వైపు దూసుకెళ్తున్న సమయంలో ఓ నిర్మాత తాను నష్టపోయాను. ఆ డబ్బు సంగతేంటి? అంటూ వివాదానికి తెర లేపారు. ఆ నష్టపోయిన సినిమా ఏంటి? ఆ నిర్మాత ఎవరు? ఈ వివాదంపై నెటిజన్ల అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నల్లోకి వెళితే..
నన్ను, నా ఖుషీపై ఎటాక్:వైజాగ్‌లో జరిగిన ఖుషి సక్సెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. హిట్ ఇచ్చినా, ఫ్లాప్ ఇచ్చినా నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్స్. నేను గెలిస్తే ఇంత మందికి ఆనందం ఉందంటే.. ఇక నుంచి మీ కోసం పనిచేస్తాను అని విజయ్ దేవరకొండ అన్నారు. అయితే తనపై, తన సినిమాపై పరోక్షంగా, సోషల్ మీడియాలో ఎటాక్ చేస్తున్నారు. ఫేక్ బీఎంఎస్ (బుక్ మై షో)తో తనను టార్గెట్ చేస్తున్నారు. ఊరు, పేరులేని 10 వేల అకౌంట్లతో నా సినిమాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని విజయ్ దేవరకొండ అన్నారు.

ప్రజలకు 1 కోటి విరాళం :అయితే ఖుషి సక్సెస్‌ను మీతో పంచుకోవాలని ఉంది. నా కోసం ఇంత చేస్తున్న మీకు అండగా నిలబడుతాను. నా సంపాదనలో 1 కోటి రూపాయలు ఇస్తాను. 100 మంది నిరుపేద ఫ్యామిలీలకు, వారి పిల్లల చదువులకు ఒక్కక్కొరికి 1 లక్షల రూపాయలు ఇస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించారు. అందుకోసం విజయ దేవరకొండ ఓ ఫామ్‌ను కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

వరల్డ్ ఫేమస్ లవర్‌కు భారీ నష్టం:ఇదంతా పక్కన పెడితే.. వైజాగ్‌లో ప్రజల కోసం 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పడంపై ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ వివాదాస్పద ట్వీట్ చేసింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిస్టిబ్యూషన్ చేసినప్పుడు మాకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆ సమయంలో ఎవరూ కూడా స్పందించలేదు. ఇప్పుడు ఫ్యామిలీల కోసం కోటి రూపాయలు ఇస్తానని పెద్ద మనసు చాటుకొన్నావు. అయితే నష్టపోయిన ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్ల ఫ్యామిలీలను కూడా ఆదుకోండి అని అభిషేక్ పిక్చర్స్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు పెట్టారు.
విజయ్ దేవరకొండ ఎందుకు ఇవ్వాలి? :అయితే అభిషేక్ పిక్చర్ బ్యానర్ పెట్టిన పోస్టుపై విజయ్ దేవరకొండ ట్రెండ్స్ స్పందించింది. డియర్ అభిషేక్ పిక్చర్.. వరల్డ్ ఫేమస్ లవర్ బిజినెస్ అగ్రిమెంట్ NRA బేసిస్‌లో జరిగింది. ఆ సినిమా లాభ, నష్టాలకు సంబంధం లేని హీరో మీరు చెప్పిన నష్టాన్ని భరిస్తూ ఎందుకు డబ్బు మీకు ఇవ్వాలి? మీరు వెస్ట్ గోదావరి జిల్లాలో అర్జున్ రెడ్డి సినిమా డిస్టిబ్యూషన్ చేసి భారీ లాభాలు తెచ్చుకొన్నారు. వాటిని మీరు తిరిగి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మీకు విజయ్ దేవరకొండను టార్గెట్ చేయాలను కొంటే.. ప్రొడ్యూసర్ల నుంచి ఏదైనా అడిగి తెలుసుకొండి అని ట్వీట్ చేశారు.

అర్జున్ రెడ్డి లాభాల నుంచి ఇస్తారా? :అయితే విజయ్ దేవరకొండను ప్రశ్నించడంపై రౌడీ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇదే ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతావా? స్టార్ హీరో సినిమా డిస్ట్రిబ్యూషన్ నష్టం వస్తే అడిగే దమ్ము ఈ ప్రొడక్షన్ హౌస్‌కు ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం సరికాదు అని పలువురు హితవు పలుకుతున్నారు.


Click it and Unblock the Notifications











