twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో ఫేక్‌ న్యూస్ కలకలం.. బ్రదర్‌ నేనున్నా.. విజయ్ దేవరకొండకు అండగా మహేష్‌బాబు

    |

    టాలీవుడ్‌లో ఫేక్‌న్యూస్ ప్రచురించే వెబ్‌సైట్లపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. కొన్ని వెబ్‌సైట్లను టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దిగ్గజాలు బహిరంగంగా స్పందిస్తున్నాయి. విజయ్ దేవరకొండకు సపోర్ట్‌గా నిలుస్తూ టాలీవుడ్ ప్రముఖులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ, అనిల్ సుంకర లాంటి ప్రముఖులు స్పందించడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    ప్రేక్షకుల ప్రేమ కోసం సంవత్సరాలుగా

    ప్రేక్షకుల ప్రేమ కోసం సంవత్సరాలుగా

    ప్రజలు, ప్రేక్షకుల ప్రేమ, గౌరవం పొందాలంటే ఏళ్లపాటు కష్టం. శ్రమ, సహనం, పట్టుదల, త్యాగం చేయాల్సి ఉంటుంది. నీవు చేసే పని భార్యను మెప్పించాలి. అలాగే నీ పిల్లలు సూర్ హీరోగా చూడాలి, అలాగే సూపర్‌స్టార్‌గా అభిమానులు ఇష్టపడేలా ఉండాలని నిరంతరం కష్టపడుతాం అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    డబ్బు కోసం కొందరు

    డబ్బు కోసం కొందరు

    ఇలాంటివేమీ పట్టించుకోకుండా దారిన పోయే దానయ్యలు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. డబ్బు కోసం నిన్ను అగౌరవపరిచేలా చేస్తారు. సోమ్ము కోసం తప్పుడు సమాచారం, అబద్దాలు ఆడటానికి కూడా వెనుకాడరు అంటూ తన ట్వీట్‌లో విజయ్ దేవరకొండ ధ్వజమెత్తారు.

    నాకు స్వప్రయోజనాలు లేవు

    నాకు స్వప్రయోజనాలు లేవు

    నాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేకుండా అందమైన తెలుగు సినిమా పరిశ్రమను కాపాడటమే నా ముఖ్య ఉద్దేశం. ఒక రకమైన ప్రపంచం నుంచి నా పిల్లలను, నా ఫ్యాన్స్‌ను కాపాడటమే నా మొదటి లక్ష్యం. సినిమాలపై అబద్దాలు, తప్పుడు ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్లపై ఇండస్ట్రీ తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. killFakeNews #KillGossipWebsites అని విజయ్ దేవరకొండ అన్నారు.

    విజయ్ దేవరకొండకు అండగా మహేష్ బాబు ట్వీట్

    విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్‌పై సూపర్‌స్టార్ మహేష్‌బాబు వెంటనే స్పందించారు. killFakeNews #KillGossipWebsites అంటూ రీట్వీట్ చేశారు. బ్రదర్ విజయ్ దేవరకొండ నేను నీకు అండగా ఉన్నాను అంటూ మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    కొరటాల శివ, అనిల్ రావిపూడి

    ఇంకా దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి తదితరులు ట్వీట్లు చేసి విజయ్ దేవరకొండకు అండగా నిలిచారు. కొరటాల శివ రూజ్‌వెల్ట్ చెప్పిన ప్రఖ్యాత కొటేషన్‌ను షేర్ చేశారు. అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ఇండస్ట్రీ ఏకతాటిపై నిలువాల్సిన సమయం ఇది. సార్ మీకు అండగా నేను ఉన్నాను అంటూ విజయ్ దేవరకొండ బాసటగా నిలిచారు.

    Recommended Video

    Raashi Khanna Shocking Decision On Telugu Cinema

    హరీష్ శంకర్ స్పందిస్తూ..


    విజయ్ దేవర కొండ ట్వీట్‌పై హరీష్ శంకర్ స్పందిస్తూ.. నేను మీకు తోడుగా ఉంటాను విజయ్. ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చూసి ఇష్టపడ్డాం. ఇప్పుడు ఆఫ్ స్క్రీన్‌లో మీరు చేసే పనిని గౌరవిస్తున్నాం. మీరు ముందుకు పోవాలి. మీకు మరింత పవర్‌ను ఇస్తాం అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

    English summary
    Vijay Deverakonda fight against on Fake News websites. Mahesh Babu, Anil Ravipudi, koratala Siva and many celebrities repsonding and retweeting the Vijay Deverakonda's tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X