twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా రెమ్యూనరేషన్ అంతే.... అవార్డ్ అమ్మేసిన విజయ్ దేవరకొండ, ఎంతకు కొన్నారంటే?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Vijay Deverakonda filmfare Award Get Auctioned

    'అర్జున్ రెడ్డి' సినిమాకుగాను యంగ్ హీరో విజయ్ దేవరకొండ 65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ వేడుకలో ఉత్తమ నటుడు అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. జీవితంలో అందుకున్న తొలి వార్డుతో ఏదైనా మంచి పని చేయాలని నిర్ణయించుకున్న విజయ్ దాన్ని వేలం వేయాలని, తద్వారా వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇవ్వాలని నిర్ణయించున్నారు. విజయ్ నిర్ణయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం స్పందిస్తూ అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డు భారీ రేటుకు అమ్ముడు పోయింది.

    రూ. 25 లక్షలకు కొనుగోలు దివి ల్యాబొరేటరీస్‌

    రూ. 25 లక్షలకు కొనుగోలు దివి ల్యాబొరేటరీస్‌

    విజయ్ దేవరకొండ ‘ఫిల్మ్ ఫేర్' అవార్డును వేలానికి పెట్టగా దివి ల్యాబొరేటరీస్‌ సొంతం చేసుకుంది. వారు దీన్ని రూ. 25లక్షలకు దక్కించుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థ అధినేత శకుంతలదేవి విజయ్ దేవరకొండకు చెక్ అందజేశారు.

     సీఎం రిలీఫ్ ఫండ్ కోసం...

    సీఎం రిలీఫ్ ఫండ్ కోసం...

    అవార్డు అమ్మడం ద్వారా వచ్చిన రూ. 25 లక్షలను విజయ్ దేవరకొండ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేశారు. ఆదివారం రౌడీ పేరుతో తన సొంత దుస్తుల బ్రాండ్ లాంచ్ చేసిన సందర్బంగా విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని వెల్లడించారు.

    అంత వస్తుందనుకోలేదు, అర్జున్ రెడ్డి పారితోషికం ఇంకా తక్కువే

    అంత వస్తుందనుకోలేదు, అర్జున్ రెడ్డి పారితోషికం ఇంకా తక్కువే

    ‘నా అవార్డు అసలు ఎవరైనా కొంటారా, కొంటే ఎంతకు కొంటారు? అనుకున్నా. ప్రతి నటుడికి ఫిల్మ్‌ఫేర్‌ చాలా ముఖ్యం. వేలం పెట్టా, చాలా మంది ముందుకు వచ్చారు. వారు నాకు ఫోన్ చేసి.. ఎంత ఊహిస్తున్నారు? అని అడిగేవారు. రూ.5 లక్షలు అని చెప్పేవాడిని. ఎందుకంటే ‘అర్జున్‌రెడ్డి' సినిమాకు సైన్ చేసినపుడు నేను తీసుకున్న పారితోషికం అది. ఆ తర్వాత లాభాల్లో షేర్‌ ఇచ్చారు. రూ. 25 లక్షలకు దివి లాబొరేటరీస్ వారు అవార్డు కొన్న తర్వాత... దాన్ని నా దగ్గరే పెట్టుకోమని శకుంతలాదేవి చెప్పారు. కానీ, వద్దు అన్నాను' అని విజయ్‌ పేర్కొన్నారు.

    ఎవరూ చేయని పని చేసిన విజయ్

    ఎవరూ చేయని పని చేసిన విజయ్

    న‌టీన‌టుల జీవితంలో అవార్డుల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అందులోనూ మొదటి అవార్డ్ అంటే మరింత ప్రత్యేకం. కానీ విజ‌య్ తీసుకున్న నిర్ణ‌యం చాలా గొప్పగా ఉంది అంటూ జూహి చావ్లా, రిచా చ‌ద్దా, శిఖ త‌ల‌సానియా లాంటి వారు సైతం ప్రశంసించారు.

    ఈ ఆలోచన ఎలా వచ్చింది?

    ఈ ఆలోచన ఎలా వచ్చింది?

    విజయ్ దేవరకొండ అవార్డు అందుకున్న అనంతరం మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బాగానే సంపాదిస్తున్నావ్... ఈ అవార్డును మాకి ఇచ్చేయ‌చ్చు క‌దా? అని స‌ర‌ద‌గా అన్నారట‌. ఆయన మాటను సీరియస్‌గా తీసుకున్న విజయ్ దాన్ని వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు.

    English summary
    Vijay revealed that he has auctioned his Filmfare award that he won for 'Arjun Reddy' to Divis laboratories for Rs 25 Lakh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X