twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరాస్తే చెంపచెల్లుమంది, ‘అర్జున్ రెడ్డి’ హీరో 2012లో డబ్బు కోసం ఇలా (ఫోటోస్)

    విజయ్ దేవరకొండ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు. 2012లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

    By Bojja Kumar
    |

    'అర్జున్ రెడ్డి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ విజయ్ దేవరకొండ. శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో పెద్దగా గుర్తింపులేని పాత్ర చేసిన విజయ్.... 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా ద్వారా అందరి దృష్టిలో పడ్డాడు.

    'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన 'ద్వారక' ప్లాప్ అయినప్పటికీ తాజాగా విడుదలైన 'అర్జున్ రెడ్డి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

    డి.విజయ్ సాయి

    డి.విజయ్ సాయి

    విజయ్ దేవరకొండ అసలు పేరు దేవరకొండ విజయ్ సాయి. చిన్నతనంలో తన టెక్ట్స్ బుక్స్ మీద డి.విజయ్ సాయి అని రాసుకునే వాడట. అయితే ఇపుడు డి.విజయ్ సాయి అని పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, అలా పిలవడం వల్ల తన స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయని అంటున్నాడు ఈ ‘అర్జున్ రెడ్డి' స్టార్.

    చెంపదెబ్బలు పడ్డాయి

    చెంపదెబ్బలు పడ్డాయి

    స్కూల్ రోజుల్లో టెక్స్ బుక్స్ మీద TheDeverakonda అని రాస్తే టీచర్ చెంపదెబ్బలు కొట్టేది. అయితే ఇపుడు నేను చిన్న పిల్లాన్ని కాదు. యాక్టర్ అయ్యాను. ఇకపై డి.విజయ్ సాయిగా నన్ను చూసుకోవడం ఇష్టం లేదు. అందుకే DVijaySai అనేదాన్ని TheDeverakondaతో రిప్లేస్ చేసుకుంటున్నాను. ఏమైనా కానివ్వండి నాకు అదే కావాలి.. అంటూ ట్వీట్ చేశారు.

    2012లో డబ్బు కోసం

    2012లో డబ్బు కోసం

    సినిమా రంగంలోకి రాక ముందు కాలేజ్ రోజుల్లో పాకెట్ మనీ కోసం అప్పుడప్పుడు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చెప్పిన విజయ్..... తర్వాత థియేటర్ ఆర్ట్స్‌లో చేరి యాక్టింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే. తర్వాత డబ్బు సంపాదన కోసం చిన్నారులకు యాక్టింగులో ట్రైనింగ్ కూడా ఇచ్చాడట.

    ట్విట్టర్లో అప్పటి ఫోటోస్

    ట్విట్టర్లో అప్పటి ఫోటోస్

    2012లో తాను ప్రీ నర్సరీ పిల్లలకు యాక్టింగులో శిక్షణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులతో కొన్ని ఫోటోస్ షేర్ చేసుకున్నారు. 2012లో తాను స్క్రిప్ట్ రాసుకుని, దర్శ‌కత్వం బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ పిల్ల‌ల‌కు న‌ట‌న నేర్పేవాడిన‌ని, అలా డ‌బ్బు సంపాదించుకునే వాడిన‌ని అన్నారు.

    నాకు చాలా ఇష్టమైన పని

    నాకు చాలా ఇష్టమైన పని

    ఆ ప‌ని చేయ‌డ‌మంటే త‌న‌కి ఎంతో ఇష్ట‌మ‌ని, ఇప్ప‌టికీ ఆ ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు. అపుడు పిల్లలతో నేను చేయించిన ఆ ప్లే(నాటకం) సూపర్ హిట్ అయింది. ఆ పిల్లలు బ్రిలియంట్ పెర్ఫార్మర్స్ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

    English summary
    "A friend sent me these this morning bringing Flashbacks 2012- writing/Directing and teaching acting to these pre-nursery cuties. A way to make some money and still do what I love. It was a superhit play and they were brilliant performers." Vijay Devarakonda tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X