పక్కా నవ్వుకుని చస్తరు: ‘టాక్సీవాలా’పై విజయ్ దేవరకొండ ఫన్నీ స్పీచ్
Recommended Video

విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్ 2 , యువి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'టాక్సీవాలా'. ఎస్‌కెఎన్ నిర్మాత. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరెగేట్రం చేస్తున్నారు. మే 18న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ తన ఫన్నీ స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు.

రెండు టిక్స్ పడిపోయాయి
నా పోస్టర్ మీద యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ లోగో చూడటం చాలా గర్వంగా ఉంది. యాక్టర్ అయిన తర్వాత కొన్ని చేయాలని ఓ లిస్టు రాసి పెట్టుకున్నాను. ఈ రోజు దాంట్లో రెండు టిక్స్ పడిపోయాయి. ఈ అవకావం ఇచ్చిన అరవింద్ గారికి థాంక్స్. మీ బేనర్లో చేయడం గౌరవంగా భావిస్తున్నాను... అని విజయ్ దేవరకొండ తెలిపారు.

మెంటల్ మెంటల్ అయితే ఇలాంటి సినిమా వచ్చింది
ఒక స్క్రిప్టు గురించి ఎగ్జైటెడ్‍గా ఉన్న ఒక బంచ్ ఆఫ్ యంగ్‌స్టర్స్‌ను మీ స్టైల్ లో మీరు తీయండ్రా అని వదిలేస్తే సెట్ మీద మెంటల్ మెంటల్ అయితే ఇలాంటి సినిమా వస్తుంది. మా చిల్ టీమ్‌కు చిల్లెస్ట్ బాస్ట్ అరవింద్ గారు మీకు నచ్చినట్లు తీయండి అని ఫుల్ పర్మిషన్ ఇచ్చారు....అని విజయ్ దేవరకొండ తెలిపారు.

చాలా కొత్తగా ఉండే సినిమా
టాక్సీవాలాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, సైన్స్ ఫిక్షన్స్, థ్రిల్లర్, కామెడీ చాలా ఉన్నాయి. నా కెరీర్లో చేస్తున్న మూడో డిఫరెంట్ మూవీ. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, ఈ మూవీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

పక్కా నవ్వుకుని చస్తరు
మనకు రోజూ రకరకాల స్ట్రెస్ ఉంటుంది. వాటన్నింటి నుండి ఉపశమనం పొంది రిలాక్స్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఒకసారి అందరం కలిసి కూర్చుని, గట్టిగా నవ్వుకుంటే ఒక రిలీఫ్ ఉంటుంది చూండండి... అలాంటి రిలీఫ్ ఈ సమ్మర్లో టాక్సీవాలాతో వస్తుంది. మే 18న సినిమా రిలీజ్...ఈ చిత్రం ఏ థియేటర్లో ప్లే అవుతుందో చూసుకుని మంచి పాప్ కార్న్ బకెట్ తీసుకుని హాయిగా చూస్తే నవ్వుకుని చస్తరు. పక్కా నవ్వుకుని చస్తరు.... అంటూ విజయ్ దేవరకొండ తనదైన మేనరిజంతో నవ్వించారు.


Click it and Unblock the Notifications











