ఒకటి దొబ్బింది.. స్వప్నక్కా మీఊరొచ్చా.. నోటా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అదరగొట్టిన విజయ్ దేవరకొండ!

Recommended Video

Vijay Deverakonda Goose Bumps Speech @Nota Public Meet

తెలుగు ఆడియన్స్ ని అలరిస్తూ విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. యువతలో విజయ్ దేవరకొండకు రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు. కొన్ని నెలల క్రితం విడుదలైన గీత గోవిందం చిత్రం సృష్టించిన కలెక్షన్ల సునామి గురించి అందరికి తెలిసిందే. ట్రేడ్విశ్లేషకులు సైతం నివ్వెరపోయేలా గీత గోవిందం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద గీత గోవిందం చిత్రం కనక వర్షం కురిపించింది. ఆ వేడి చల్లారక ముందే విజయ్ దేవరకొండ నోటా చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా జరిగిన నోటా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ అదరగొట్టాడు.

 ఏపీ ప్రజలందరికీ

ఏపీ ప్రజలందరికీ

నోటా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలందరికి నమస్కారం. తెలుగువాళ్ళకు రెండు రాష్ట్రాలు ఉన్నాయనే సంగతే నాకు గుర్తు లేడు. మన జనరేషన్ యువత చాలా మంది ఇలాగే భావిస్తుంటారేమో. మనకంటే చినవాళ్లకు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు అని బాగా తెలిసి ఉంటుంది.

 కేకలు పెట్టిన ఆడియన్స్

కేకలు పెట్టిన ఆడియన్స్

ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన అభిమానులు.. విజయ్ దేవరకొండ స్టేజిపైకి రాగానే పెద్ద ఎత్తున కేకలు పెడుతూ ఘనస్వాగతం పలికారు. అరవండి నేను కూడా వింటా అంటూ అభిమానులని విజయ్ దేవరకొండ హుషారెత్తించాడు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ అశ్విని దత్ కుమార్తె స్వప్న దత్ తెలిపిన విషయాన్ని విజయ్ దేవరకొండ స్టేజిపై ప్రస్తావించాడు.

 కారులో వెళుతుంటే

కారులో వెళుతుంటే

స్వప్నక్క, నేను కారులో వస్తున్నాం.. సూర్యాపేట దాటుతుంటే ఓ విషయం చెప్పింది. ఇక్కడ వరకు నిన్ను గుర్తించారు. విజయవాడ ఎంటర్ అవుతున్నాం.. ఇక్కడ కూడా నువ్వు గుర్తింపు తెచ్చుకుంటే నువ్వు స్టార్ అయిపోయినట్లే రా. నిన్నెవరూ ఇక ఆపలేరు అని చెప్పింది.

కెమెరా ఎక్కడ.. జూమ్ చెయ్

కెమెరా ఎక్కడ.. జూమ్ చెయ్

కెమెరా వంక చోస్తూ నన్ను జూమ్ చేసుకో అని చెప్పాడు. స్వప్నక్కా మీ ఊరు విజయవాడ వచ్చా. మీ ఊరు ఇప్పుడు మావాళ్లు అంటూ విజయ్ దేవరకొండ ఆడియన్స్ ని హుషారెత్తించాడు.

ఒకటి దొబ్బింది

ఒకటి దొబ్బింది

ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత ఇప్పుడే విజయవాడకు వస్తున్నా. ఈ మూడేళ్లలో చాలా జరిగింది. నాలుగు సినిమాలు చేశా. అందులో ఒకటి దొబ్బింది. ఈ మూడు చిత్రాలలో మీకు ఈచిత్రం నచ్చిందో చెప్పండి అంటూ విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల పేర్లు చెప్పాడు. ప్రతి చిత్రానికి ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడం విశేషం.

ఈ రెండూ అంటే పిచ్చి

ఈ రెండూ అంటే పిచ్చి

విజయవాడోళ్ళకి సినిమా, రాజకీయాలు అంటే పిచ్చి అని విన్నా. సినిమా, రాజకీయాలు కలబోసిన చిత్రమే నోటా అని విజయ్ దేవరకొండ తెలిపాడు. విజయ్ దేవరకొండ అనే నేను.. దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ చెబుతున్నా.. ఈ అక్టోబర్ 5న మీ కోసం సూపర్ హిట్ మూవీ అందించబోతున్నా అంటూ ఆడియన్స్ కి ప్రామిస్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X