అపుడు నావద్ద డబ్బుల్లేవు, చైతన్య మస్తు చిల్: విజయ్ దేవరకొండ హానెస్ట్ స్పీచ్

అక్కినేని నాగ‌చైత‌న్య, నిధీ అగ‌ర్వాల్ జంట‌గా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యసాచి' నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ హాజరైన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హానెస్ట్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, నాగ చైతన్యతో తన గత అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా చైతూ గురించి విజయ్ చెప్పిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.

నా దగ్గర డబ్బుల్లేకుంటే ఆయనే కట్టారు

నా దగ్గర డబ్బుల్లేకుంటే ఆయనే కట్టారు

విజయ్ మాట్లాడుతూ... ‘మ్యాన్ ఆఫ్ టూడే కీరవాణి గారు. ఆయన్ను చూసినప్పుడల్లా హగ్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ, ఊరికే ఊరికే హాగ్ ఇస్తే బావుండదని చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నా. ఫస్ట్ టైమ్ కీరవాణిగారిని బాంబే నుంచి ఫ్లైట్ లో వస్తున్నప్పుడు కలిశా. నా వెనుక సీటులో కూర్చుకున్నారు. ఫ్లైట్‌లో ఏదో ఫుడ్ ఆర్డర్ చేస్తే... నా దగ్గర డబ్బుల్లేవు. ఎప్పుడూ ఇదే పరిస్థితి. అప్పుడు కీరవాణిగారు వచ్చి డబ్బులు కట్టారు. ఆ రోజు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఐ లవ్ కీరవాణి సర్ మ్యూజిక్. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా... అని వ్యాఖ్యానించారు.

Recommended Video

Siddi Sriram About Taxiwala Movie | Vijay Devarakonda | Priyanka Jawalkar | Rahul Sankrityan
 ఫోన్ చేసి అర్జంటుగా కలవాలన్నారు

ఫోన్ చేసి అర్జంటుగా కలవాలన్నారు

నేను ఒక సినిమా చేసిన తరవాత మైత్రీ మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు కాల్ చేసి అర్జంటుగా కలవాలన్నారు. రేపు కలుద్దామా? ఎల్లుండి కలుద్దమా? అని నేను అంటే ఇప్పుడే అర్జెంటుగా అంటూ నా ఆఫీసుకు వచ్చి కలిశారు. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా దింపుతున్నాం. వారు చాలా మంచి వ్యక్తులు, సినిమా మీద వారికి ఉన్న పాషన్ ఇంక్రెడబుల్, 'సవ్యసాచి'తో గట్టిగా కొడతారని నమ్ముతున్నా అని విజయ్ చెప్పుకొచ్చారు.

మ్యాడీ సర్ మేము మీ అభిమానులం

మ్యాడీ సర్ మేము మీ అభిమానులం

మ్యాడీ(మాధవన్) సర్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడం ఆనందంగా ఉంది. మేమంతా మీ అభిమానులం. మీ తమిళ సినిమాలను తెలుగులో చూస్తుంటామని చెప్పుకొచ్చారు.

చై షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్విన విధానంలోనే మస్తు చిల్ రిలాక్సడ్ వైబ్ ఉంటుంది

చై షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్విన విధానంలోనే మస్తు చిల్ రిలాక్సడ్ వైబ్ ఉంటుంది

ఎందుకో తెలియదు నాకు నా చైతన్య అంటే చాలా ఇష్టం. ఒక్కసారే కలిశా... అది కూడా 30 సెకన్లు మాత్రమే. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్విన విధానంలోనే మస్తు చిల్ రిలాక్సడ్ వైబ్ ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరూ ఫ్రెండ్స్ లేరు. కానీ, ఇండస్ట్రీలో చైతన్య గురించి ఎవరు మాట్లాడినా 'చై ఈజ్ అమేజింగ్ ఫెలో... చిల్ గాయ్' అంటారు. అందరూ చైతన్యను ప్రేమిస్తారు. నువ్వు స్ట్రెస్ ఫ్రీగా, రిలాక్స్డ్ గా ఉండటం చాలా నచ్చుతుందని విజయ్ తెలిపారు.

తొలిసారి అప్పుడే కలిశాను

తొలిసారి అప్పుడే కలిశాను

నేను డిగ్రీలో ఉన్నపుడు నువ్వు 'జోష్' సినిమాతో లాంచ్ కావడానికి రెడీ అవుతున్నాడు. నాకు యాక్టర్ అవ్వాలనే కోరిక అపుడు కొంత ఉండేది. నాకు తెలిసిన వినోద్ బాల అంకుల్ చైతన్యతో అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ వర్క్ షాప్ చేస్తున్నారు. ఆ రోజు నన్ను అన్నపూర్ణ లోపలికి పంపిస్తారో లేదో అని భయపడ్డా కానీ పంపారు. అక్కడ చైతన్య, వినోద్ బాల అంకుల్ మాత్రమే ఉన్నారు. చైతన్యకు గుర్తుంటే.. అక్కడ మరో అబ్బాయి కూర్చుని నిన్ను చూస్తున్నాడు.... అది నేనే.

చిన్నప్పుడు 'శివ', 'క్రిమినల్', 'గోవిందా గోవిందా' చూసి నాగ్ సర్ అంటే ఒక పిచ్చి ఉండేది. నాగ్ సర్ కొడుకు.. అన్నపూర్ణ స్టూడియో అనగానే మరో ప్రపంచం అన్నట్టు ఉంది. ఈ రోజు ఈ సినిమా ఫంక్ష‌న్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X