»   » పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుండి ఫోన్? తెర వెనక ఏం జరుగుతోంది?

పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుండి ఫోన్? తెర వెనక ఏం జరుగుతోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫీసు నుండి యువ నటుడు విజయ్ దేవరకొండకు ఫోన్ వెళ్లడం ఇప్పుడ చర్చనీయాంశం అయింది. ఈ విజయ్ దేవరకొండ మరెవరో కాదు...ఇటీవల విడుదలైన 'పెళ్లి చూపులు' సినిమాలో హీరో. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాని విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు' తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

పెళ్లి చూపులు మూవీలో మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చడం, లుక్స్ పరంగా బావుండటంతో ఈ యువ హీరోకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. మెగా డాటర్ నిహారిక రెండో సినిమాలో కూడా విజయ్ దేవరకొండ హీరోగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుండి ఇతడికి ఫోన్ రావడం హాట్ టాపిక్ అయింది. పవన్‌ స్నేహితుడు, నిర్మాత శరత్‌ మరార్ విజయ్‌కు ఫోన్‌ చేసి అభినందించడంతో పాటు ఒకసారి కలుద్దామని, ఆఫీస్‌కు రమ్మని పిలినట్లు వార్తలు వినిపిస్తునప్నాయి.

పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుండి ఫోన్ రావడం అంటే.... దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని అంటున్నారు. స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు....

కారణం ఏమిటి?

కారణం ఏమిటి?

పవన్ కళ్యాణ్ హీరోగా శరత్ మరార్ నిర్మాణంలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రకు విజయ్ ని తీసుకునే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

ఇబ్బందుల్లో పడ్డట్లే...

ఇబ్బందుల్లో పడ్డట్లే...

ఒక వేళ అదే నిజమైతే విజయ్ దేవరకొండ ఇబ్బందుల్లో పడ్డట్లే. ప్రస్తుతం హీరో రేంజికి వచ్చాడు యంగ్ స్టార్. ఇలాంటి తరుణంలో హీరో క్యారెక్టర్లు ఎంచుకుంటేనే కెరీర్లో గ్రోత్ ఉంటుంది.

సైడ్ క్యారెక్టర్లు చేస్తే..

సైడ్ క్యారెక్టర్లు చేస్తే..

వపన్ కళ్యాణ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేస్తే ఇకపై అతనికి సైడ్ క్యారెక్టర్లే తప్ప హీరోగా చాన్సులు వచ్చే అవకాశం ఉండదని కొందరి వాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో పరిస్థితి అలానే ఉంటుందని అంటున్నారు.

ఇదే నిజమని చెప్పలేం?

ఇదే నిజమని చెప్పలేం?

అయితే ఇదంతా ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుండి ఫోన్ రావడం వెనక ఇదే కారణం అని కచ్చితంగా చెప్పలేం అని అంటున్నారు.

నిహారిక కోసమా?

నిహారిక కోసమా?

నిహారిక రెండో సినిమాలో హీరోగా చేయమని అడగటం కోసం కూడా పవన్ పిలిపించి ఉండొచ్చని అంటున్నారు.

త్వరలో క్లారిటీ..

త్వరలో క్లారిటీ..

ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా అతనితో పవన్ కళ్యాణ్ మీటింగ్ అయితే తప్ప ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

పెళ్లి చూపులు

పెళ్లి చూపులు

పెళ్లి చూపులు మూవీ ఇటీవల విడుదలై భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన రెండోవారంలోకి ఎంటరైనా బాక్సాఫీసు వద్ద నెం.1 పొజిషన్లో కొనసాగుతోంది.

తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేస్తోంది.

చిన్న సినిమా పెద్ద లాభం

చిన్న సినిమా పెద్ద లాభం

కేవలం రూ. 1 కోటి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు భాక్సాఫీసు వద్ద భారీ లాభాలు వస్తున్నాయి. యూఎస్ఏలో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ మార్కుకు చేరుకుంది.

పెట్టుబడికి 20 రెట్లు లాభం

పెట్టుబడికి 20 రెట్లు లాభం

ఈ సినిమా పెట్టుబడికి 20 రెట్లు లాభాలు బక్సాఫీసు వద్ద నమోదు కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

ఆ సినిమాలు కూడా..

ఆ సినిమాలు కూడా..

ఈ సినిమా విడుదలైన వారం తర్వాత మనమంతా, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు రిలీజైనా ‘పెళ్లి చూపులు' సినిమా ఏ మాత్రం డౌన్ కాక పోవడం విశేషం.

English summary
A buzz is that, Vijay Deverakonda has been approached to play an important role in Power Star Pawan Kalyan's new film in Dolly's direction. However, details about Vijay's role in the film are yet not known.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu