విజయ్ దేవరకొండకు ఇలాంటి పరిస్థితా? ముగ్గురు సూపర్ స్టార్ల నుంచి సాయం..!?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నేటితరం ఆడియెన్స్ కు ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గురించి తెలిసిందే. ఎందుకంటే.. 'అర్జున్ రెడ్డి'తో ఆయన చేసిన సంచలనం అంతాఇంతా కాదు.. సినిమాలో డాషింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా.. మూవీ ప్రమోషనల్ ఈవెంట్లు, పలు ఇంటర్వ్యూల్లోనూ తన టాకింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి విజయ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. ఏకంగా స్టార్ హీరోగానూ పేరు సంపాదించుకున్నాడు.
వరుసపెట్టి సినిమాలు చేస్తూ కనిపించారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా, మొన్నటి కల్కి2898 వరకూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే వచ్చారు. అయితే విజయ్ దేవరకొండకు మొదట్లో కాలం కలిసివచ్చినా... ఆ తర్వాత సినిమాలతో మాత్రం బెడిసికొట్టింది. ఎంత ఫోకస్డ్ గా సినిమా తీసినా ఫలితం లేకుండా పోయింది. 'లైగర్' వంటి చిత్రంతో విజయ్ కు పెద్ద షాక్ తగిలింది. ఎన్ని ఫ్లాప్స్ పడినా.. విజయ్ దేవరకొండ క్రేజ్ ను మాత్రం తగ్గించలేకపోయాయనేది నిపుణుల అభిప్రాయం. దాని కారణంగానే క్రేజీ లైనప్ ను కూడా సెట్ చేశారు.

విజయ్ సినిమాలకు కాకపోయినా.. విజయ్ కోసమైనా థియేటర్లకు వచ్చే ఆడియెన్స్ మాత్రం కోట్లల్లోనే ఉన్నారు. దాని మూలంగానే రాబోయే చిత్రాలతోనైనా రౌడీస్టార్ మళ్లీ ఒక ఊపూపుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈక్రమంలో నెక్ట్స్ VD12తో పక్కా ప్లానింగ్ తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని 'జెర్సీ' మూవీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్స్లే లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. త్వరలోనే చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టీమ్.
కాగా, పలు చిత్రాలకు విజయ్ దేవరకొండనే అండగా నిలిచి, క్యామియో రోల్స్ తో సపోర్ట్ చేసిన సందర్భాలు చూశాం. అలాంటిది ఇప్పుడు ఆయన సినిమాకే స్టార్ హీరోల సాయం తీసుకున్నారని తెలుస్తోంది. వీడీ12ను మాత్రం గ్రాండ్ గా రిలీజ్ చేయాలని, కంటెంట్ పై నమ్మకంతో ఉండటం మూలంగా ఆడియెన్స్ ను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు విజయ్ సినిమా కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
You have all been patient.
— Vijay Deverakonda (@TheDeverakonda) February 7, 2025
We have felt your tough love.
We are now ready to open our world, our story and all our hearts to you.
With a Title and Teaser you will be proud of! #VD12 pic.twitter.com/aGkBee1o6S
వీడీ12ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతుండటం విశేషం. అయితే ఫిబ్రవరి12న చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ టీజర్ విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలుగు, హిందీ, తమిళంలో టీజర్లను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. కాగా సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ముగ్గురు స్టార్ హీరోల సాయం తీసుకున్నారని తెలుస్తోంది. టీజర్ కట్ లో ఆయా భాషాల సూపర్ స్టార్ల వాయిస్ లతో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నారంట.
తెలుగులో వచ్చే టీజర్ కు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక తమిళంలో సూపర్ స్టార్ ధనుష్, హిందీ టీజర్ కు బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ తమ వాయిస్ ను అందించినట్టు తెలుస్తోంది. ఇది విజయ్ ఫ్యాన్స్ కు ఒకింత కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పాలి. వీడీ12 చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లో లాస్ట్ షెడ్యూల్ లో భాగంగా ఒక సాంగ్ ను షూట్ చేస్తుందట యూనిట్. ఇక త్వరలోనే క్రేజీ అప్డేట్స్ ను అందించనున్నారు.


Click it and Unblock the Notifications











