For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger: విజయ్ దేవరకొండ కోసం ఎగబడిన యువత.. చేతులెత్తేసిన నిర్వాహకులు.. మొత్తం క్యాన్సిల్!

  |

  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొట్టమొదటిసారి రౌడీ స్టార్ పవర్ఫుల్ బాక్సర్ గా లైగర్ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. తప్పకుండా సినిమాను చూడాలి అని కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా అభిమానులకు ప్రత్యేకంగా కలుసుకోవాలని అనుకున్న విజయ్ దేవరకొండకు కొంత చేదు అనుభవం ఎదురయ్యింది. ప్లాన్ కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  బిగ్గెస్ట్ రిలీజ్

  బిగ్గెస్ట్ రిలీజ్

  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా గత ఏడాది నుంచి ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అంచనాల స్థాయిని ఒక్కసారిగా పెంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే వివిధ భాషల్లో ఈనెల 25వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొట్టమొదటిసారి లైగర్ అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది.

   విజయ్ ప్రమోషన్స్ స్టార్ట్

  విజయ్ ప్రమోషన్స్ స్టార్ట్


  బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా లైగర్ సినిమాకు సహనిర్మాతగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆయన ఐడియాలతో ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ ఎప్పటిలానే తనదైన శైలిలో జనాల్లోకి వెళ్లి ప్రమోషన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ దేవరకొండ ఏ సినిమా విడుదలైనా కూడా ప్రతిసారి ఫ్యాన్స్ ను కలుసుకోవడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు.

  మంచి ఫ్యాన్ ఫాలోయింగ్

  మంచి ఫ్యాన్ ఫాలోయింగ్

  అయితే విజయ్ దేవరకొండకు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు ఇటీవల లైగర్ ప్రమోషన్స్ తోనే అర్థమయిపోయింది. ఇదివరకే అతని డిజాస్టర్ సినిమాలు కూడా హిందీలో డబ్ చేసినప్పుడు యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా వరల్డ్ ఫేమస్ లవర్ కూడా హిందీ ఆడియోన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది అంటే అతని రేంజ్ ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

  Recommended Video

  Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
  ముంబైలో క్యాన్సిల్

  ముంబైలో క్యాన్సిల్

  ఇక విజయ్ దేవరకొండను చూడాలి అనే నార్త్ ఇండస్ట్రీలో ఇటీవల చాలామంది జనాలు ఏగబడ్డారు. మొదట ముంబైలో ప్రత్యేకంగా ఫ్యాన్ మీట్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కూడా భారీ స్థాయిలో జనాలు రావడంతో నిర్వాహకులు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రిస్క్ చేయడం ఎందుకు అని అక్కడ ఈవెంట్ ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

   మరో ఈవెంట్ క్యాన్సిల్!

  మరో ఈవెంట్ క్యాన్సిల్!

  అలాగే బీహార్ లో కూడా విజయ్ దేవరకొండ అభిమానులను ప్రత్యేకంగా కలుసుకోవాలని అనుకున్నాడు. అయితే ఆ ఈవెంట్ కూడా జనాల తాకిడి ఎక్కువ కావడంతో నిర్వాహకులు క్యాన్సల్ చేశారు. ఏఎన్ కాలేజీలో భారీ స్థాయిలో యువత ఎగబడడంతో విజయ్ దేవరకొండ కనీసం అక్కడకి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి అతనికి ఫాలోయింగ్ ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా ఫ్యాన్స్ ను కలుసుకోకపోయినందుకు విజయ్ కు ఇది చేదు అనుభవమే అయినప్పటికీ మరొకవైపు లైగర్ సినిమాకు వస్తున్న మంచి క్రేజ్ ఉంది అనడానికి నిదర్శనం అని చెప్పవచ్చు. మరి లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.

  English summary
  Vijay Deverakonda Liger Events Getting Cancelled Due To Unprecedented Crowds
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X