బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సెన్సేషన్.. అదిరిపోయే పాత్రలో!

టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ గురించి మరో క్రేజీ న్యూస్ వచ్చింది. అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండ నటనకు మచ్చుతునకగా నిలిచింది. ఆ తరువాత వచ్చింది గీత గోవిందం చిత్రం కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో సంచలనంగా మారాడు స్టార్ హీరో సినిమాల స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

 టాక్సీవాలా చిత్రంతో మ్యాజిక్

టాక్సీవాలా చిత్రంతో మ్యాజిక్

అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో తానేంటో నిరూపించుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నోటా చిత్రం రూపంలో పరాజయం ఎదుర్కొన్నాడు. ఆ తరువాత అనేక పర్యాయాలు వాయిదా పడుతూ వచ్చిన టాక్సీవాలా చిత్రం విడుదలయింది. ఈ చిత్రంపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ విజయ్ దేవరకొండ మ్యాజిక్ చేశాడు. టాక్సీవాలా అద్భుత విజయంగా నిలిచింది.

 1983 ప్రపంచకప్

1983 ప్రపంచకప్

1983లో కపిల్ దేవ్ సారధ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. లండన్ లోని లాడ్స్ మైదానంలో భర్త త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. టీం ఇండియా సాధించిన ఈ విజయం నేపథ్యంలో దర్శకుడు కబీర్ ఖాన్ ఓ చిత్రానికి ప్లాన్ చేశారు. 83 పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ అప్పటి కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటించబోతున్నాడు.

విజయ్ దేవరకొండ కూడా

విజయ్ దేవరకొండ కూడా

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచకప్ విజయంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు సమాచారం. ఇది నిజంగా క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డిలో వ్యసనపరుడైన డాక్టర్ గా విలక్షణ నటన కనబరిచిన విజయ్ క్రికెటర్ గా ఎలా నటిస్తాడనేది ఉత్కంఠ కలిగించే అంశం.

 2020లో విడుదల

2020లో విడుదల

ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ దక్షిణాదిలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఇప్పుడిప్పుడే బాలీవడ్ లో సైతం ఈ సంచలన హీరో గురించి చర్చ జరుగుతోంది. కాఫీ విత్ కరణ్ షోలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్, శ్రీదేవి కుమార్త్ జాన్వీ ఇద్దరూ విజయ్ దేవరకొండ జపం చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X