For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లాఠీకి పనిచెప్పనని మాటిస్తే వస్తా.. కేసీఆర్ మాట వినకపోతే మీ పద్ధతిలోనే బుద్ధి చెప్పాలి..

  |

  కరోనావైరస్ మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి యువ హీరో విజయ్ దేవరకొండ సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో విధుల్లో భాగమై రియల్ హీరోలుగా మారిన పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడి ఉపశమనం కలిగించారు. విజయ్ దేవరకొండ పలకరింపుతో పోలీస్ సిబ్బందిలో ఉత్సాహం కనిపించింది. పలువురు పోలీస్ అధికారులు విజ‌య్‌కు థ్యాంక్స్ చెబుతూ త‌మ ఆనందాన్ని పంచుకున్నారు.. విజయ్ దేవరకొండకు పోలీస్ కమీషనర్ అంజన్ కుమార్‌తోపాటు ఆయన సిబ్బంది కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..

  చెక్‌పోస్టుల వద్దకు వచ్చి..

  చెక్‌పోస్టుల వద్దకు వచ్చి..

  వీలైతే పోలీస్ చెక్‌పోస్టుల వద్దకు వచ్చి ప్రజలను బయటకు రావొద్దని కోరాలని ఓ పోలీసు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మీ కోరిక మేరకు త‌ప్ప‌కుండా వ‌స్తాను. కానీ నేను వస్తే మీ లాఠీల‌కు ప‌నిచెప్ప‌కూడ‌దు. అలాంటి మాట ఇస్తే త‌ప్ప‌కుండా వ‌స్తాను.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చాలా క్లియ‌ర్‌గా బ‌య‌ట‌కు రావొద్దు అని చెప్పారు.. వాళ్లు చెప్పాక కూడా బ‌య‌ట తిరిగే వాళ్ళ‌కు మీ ప‌ద్ద‌తిలోనే స‌మాధానం చెప్పాలి.. నేను వ‌చ్చి చెబితే మంచి జ‌రుగుతుందని మీరు న‌మ్మితే త‌ప్ప‌కుండా వ‌స్తాను అని విజయ్ దేవరకొండ తెలిపారు.

  అమ్మ కోప్పడుతున్నదని

  అమ్మ కోప్పడుతున్నదని

  లాక్‌డౌన్ సమయంలో మీ అమ్మ‌కు ఏ విధంగా స‌హాయపడుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను షూటింగ్‌ల‌తో బిజీగా ఉండేట‌ప్పుడు ఇంట్లో విష‌యాల్ని అసలు ప‌ట్టించుకునే వాడ్ని కాదు. కానీ ఇప్పుడు అమ్మ ప‌డుతున్న క‌ష్టం చూస్తే మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను స‌హాయం చేయ‌డానికి వెళ్ళిన‌ప్పుడు అమ్మ నీ వ‌ల్ల మ‌రింత ప‌ని పెరుగుతుంద‌ని కోపగించుకొంటున్నారు. కానీ ఇలాంటి స‌మ‌యంలో డ్యూటీలు చేస్తూ ఇంటి ప‌నిని చ‌క్క బెడుతున్న మ‌హిళా అధికారుల‌కు హేట్సాఫ్ చెప్పాలని అనిపిస్తున్నది అని విజయ్ దేవరకొండ అన్నారు.

  పోలీస్ అధికారిగా నటిస్తాను

  పోలీస్ అధికారిగా నటిస్తాను

  పోలీస్ అధికారిగా మిమ్మ‌ల్ని చూడాల‌నుకుంటున్నామని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "త‌ప్ప‌కుండా మంచి స్క్రిప్ట్ వ‌స్తే చేస్తాను.. రానున్న రోజుల్లో మంచి పోలీస్ పాత్ర‌తో మీ ముందుకు వ‌స్తా. ఇలాంటి సమయంలో నేను పోలీస్ అయితే చాలా బాధ్య‌త‌గా ఫీలయ్యే వాడిని.. పోలీస్ క‌మీష‌న‌ర్ ఆదేశాల మేర‌కు ప‌నిచేసే వాడిని. మీరంద‌రూ మా కోసం ప‌నిచేస్తున్నారు. మేము ఇంట్లో కూర్చుంటే మీరు ప‌నిగంట‌లు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు. మీ సేవలు అత్యుత్తమం. మిమ్మల్ని చూసి గొప్పగా ఫీలవుతున్నాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

  Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
  నాకు ఫెయిల్యూర్ వస్తే..

  నాకు ఫెయిల్యూర్ వస్తే..

  మీరు డిప్రెష‌న్‌లో ఉంటే ఏం చేస్తారు అనే ప్రశ్నకు జవాబిస్తూ.. నా ప‌నే నాకు గుర్తింపునిచ్చింది. మీ అంద‌రి ప్రేమ‌ను పంచింది. నాకు ఫెయిల్యూర్స్ వ‌చ్చినా ఎప్పుడైనా మానసికంగా ఇబ్బంది క‌లిగినా నా ప‌ని మీద మ‌రింత ఫోక‌స్ చేస్తాను. నేను చిన్న‌ప్పుడు స్కూల్‌లో మ‌హాభార‌తం నాటకం వేశాను. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పిన మాటలు నా మీద బాగా ప్రభావం చూపాయి. ఈ స‌మ‌యం గ‌డిచిపోతుంది. నిజ‌మే ఈ స‌మ‌యం అయినా శాశ్వతం కాదు.. క‌రోనా కూడా అంతే మ‌నం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క‌రోనా కూడా మ‌న లైఫ్‌లో ఒక జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది అని విజయ్ దేవరకొండ అన్నారు..

  English summary
  Actor Vijay Deverakonda moral support to Telangana Police and he praised women police officers. He was part of the a program which conducted by Hyderabad police commissionarate.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X