విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్.. పూరితో సినిమా కాగానే ఆ డైరెక్టర్‌తో!
టాలీవుడ్‌లో మంచి జోష్ మీదున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. రోజురోజుకీ క్రేజ్ పెంచుకుంటూ పోతూ అనతికాలంలోనే స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో మరో సినిమాకు సైన్ చేశాడు.
విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా ప్రకటించాడు. దిల్ రాజు పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు విషెస్ చెబుతూ ట్వీట్ చేసిన విజయ్.. తన నెక్స్ట్ ప్రాజెక్టు సంగతులను తెలిపాడు.

ఈ మేరకు 'పుట్టినరోజు శుభాకాంక్షలు రాజు సర్. బ్లాక్‌బస్టర్ గిఫ్ట్ లోడింగ్. మీపై ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయి' అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు విజయ్ దేవరకొండ. హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ దేవరకొండ సినిమా అని తెలియగానే ఆయన ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలారు.
ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేలోగా శివ నిర్వాణ నేచురల్ స్టార్ నానితో 'టక్ జగదీష్' సినిమా పూర్తిచేస్తాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ మూవీ సెట్స్ పైకి వస్తుంది.


Click it and Unblock the Notifications











