సీనియర్ హీరోయిన్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్.. క్రేజీ న్యూస్!
Recommended Video

అర్జున్ రెడ్డి సెన్సేషన్ విజాజ్ దేవరకొండ టాలీవుడ్ లో తిరుగులేని విధంగా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ తో పాటు తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకునే పనిలో విజయ్ దేవకొండ ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కు విజయ్ అంగీకారం చెబుతున్నాడు. విజయ్ దేవరకొండ గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి తాజాగా ప్రచారం జరుగుతోంది.

డియర్ కామ్రేడ్ చిత్రంలో
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంలో కార్మిక నాయకుడిగా నటిస్తున్నాడు. ఆసక్తిరేపుతున్న ఈ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండకు జోడిగా ఈ చిత్రంలో రష్మిక మందన నటిస్తోంది. గీత గోవిందం తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్న రెండవ చిత్రం ఇది.

లేడి సూపర్ స్టార్‌తో రొమాన్స్
డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటించబోతున్నాడు. ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తమిళ డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ఈ చిత్రం కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

వయసులో పెద్ద
విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోనే. కానీ అతడికి నయనతార హీరోయిన్ అంటే సినీవర్గాల్లో ఆసక్తిగా మారింది. నయనతార లేడి సూపర్ స్టార్. విజయ్ దేవరకొండ కన్నా నటనలో చాలా సీనియర్. పైగా ఈ యువ హీరోకన్నా నయన్ వయసులో పెద్ద. నయన్, విజయ్ కాంబినేషన్ లో చిత్రం గురించి వార్తలు రాగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్ కనుక అధికారికంగా సెట్ అయితే తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ నెలకొంటుంది.

సైరా నరసింహారెడ్డిలో
ప్రస్తుతం నయనతార మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ నటించే డియర్ కామ్రేడ్ చిత్రం మేలో విడుదల కానుందనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత నయన్, విజయ్ నటించే చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











