బన్నీ అన్నా.. మీరు చూడాలి, నన్ను అందరూ గట్టిగా వేసుకున్నారు: విజయ్ దేవరకొండ
'గీతా గోవిందం' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పాడిన పాట వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని లిరిక్స్ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటంతో వెంటనే ఆ పాటను యూట్యూబ్ నుండి తొలగించడంతో పాటు... లిరిక్స్ మార్చి సినిమాలో పెట్టనున్నట్లు దర్శక నిర్మాతలు సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఆడియో వేడుకలో ఈ వివాదంపై విజయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Recommended Video


అంతా నన్ను గట్టిగా వేసుకున్నారు
ఆ పాట వల్ల కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు రోజులు నన్ను అందరూ గట్టిగా వేసుకున్నారు. మనో భావాలు దెబ్బతిన్న సంఘాల వారు మా లిరిక్ రైటర్ శ్రీమణిని వేసుకున్నారు. ఆ దెబ్బకు ఒక రెండు రోజులు ఆయన అండర్ గ్రౌండ్ వెళ్లిపోయారని విజయ్ తెలిపారు.

బన్నీ అన్నా... ఎంత రచ్చ చేశారో మీరు చూడాలి
ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ను ఉద్దేశిస్తూ... బన్నీ అన్నా నేను పాడిన పాట విషయంలో ఎంత రచ్చ జరిగిందో మీరు చూడాలి. సోషల్ మీడియాలో ఓ రేంజిలో నన్ను వేసుకున్నారు. ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు అంటూ.... తనపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్స్ ఆడియో వేడుకలలో ప్రదర్శింప చేశారు.

సెన్సేషనల్ అవుతుందనుకుంటే...
ఈ పాట నేను పాడటానికి ముఖ్యమైన కారణం డైరెక్టర్ పరశురామ్, నిర్మాత బన్నీ వాసు. ఈ సాంగ్ నీ గొంతుతో అయితేనే బావుంటుంది, క్యారెక్టర్ వాయిస్‌లోనే బావుంటుంది అని చెప్పి పాడించారు. అలా నేను పాడటం జరుగడం జరిగింది. ఆ పాట విడుదలైన వెంటనే బిగ్ సెన్సేషన్ అవుతుందనుకున్నాం, కానీ మరోలా సెన్సేషన్ అయిందని విజయ్ చెప్పుకొచ్చారు.

మనోభావాలు హర్ట్ చేయాలనే ఉద్దేశ్యం లేదు
మీకు నా సింగింగ్ నచ్చలేదని అర్థమైపోయింది. మనోభావాల సంఘాలకు మా లిరిక్స్ నచ్చలేదు. నచ్చకుంటే మార్చేద్దాం.... అరవింద్ గారు కూడా వెంటనే మార్చేయమన్నారు. గీతా గోవిందం అనే సినిమా చేసింది అందరూ ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో చూడటానికి. ఎవరి సెంటిమెంటైనా హర్టయితే ఆ పాట మాకు అక్కర్లేదు... అని విజయ్ దేవరకొండ తెలిపారు.
లిరిక్స్ మార్చి మళ్లీ పాడించారు
అదే పాటను లిరిక్స్ మార్చి మళ్లీ నాతో పాడించారు. సినిమా అనేది ఫన్. గీతా గోవిందం నేను ఫుల్ గాఎంజాయ్ చేస్తున్నా. రేపు ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











