విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయబోతున్న క్రేజీ హీరోయిన్.. చాలా గ్యాప్ తర్వాత!

Recommended Video

Vijay Deverakonda To Romance With Catherine Tresa | Filmibeat Telugu

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో నెక్స్ట్ మూవీలో క్రేజీ హీరోయిన్ రొమాన్స్ చేసేందుకు సిద్ధం అయినట్లు ఆంగ్ల పత్రికలో కథనాలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. హిందీలో ఒక్క చిత్రంలో కూడా నటించినప్పటికీ అతడి పేరు బాలీవుడ్ లో కూడా వినిపిస్తోంది. గత ఏడాది విజయ్ దేవరకొండ నుంచి మూడు చిత్రాలు రాగా అందులో రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ వివరాలు పరిశీలిద్దాం.

యదార్థ సంఘటనలతో

యదార్థ సంఘటనలతో

దర్శకుడు క్రాంతి మాధవ్ ఓనమాలు, మళ్లీమళ్లీ ఇది రానిరోజు లాంటి సెన్సిబుల్ చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకున్నారు. త్వరలో విజయ్ దేవరకొండని క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. క్రాంతి మాధవ్ కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా కథని సిద్ధం చేస్తున్నాడట. కె ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

క్రేజీ బ్యూటీతో రొమాన్స్

క్రేజీ బ్యూటీతో రొమాన్స్

విజయ్ దేవరకొండ యువతకు బాగా కనెక్ట్ అయిన హీరో. విజయ్ దేవరకొండ చిత్రాల్లో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు, హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఆడియన్స్ ఆసక్తిగా ఉంటారు. దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ చిత్రంలో విజయ్‌కి జోడిగా కేథరిన్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కేథరిన్ అందానికి, అభినయానికి ఆరంభంలో ప్రశంసలు దక్కాయి. కానీ అదృష్టం సరిగా లేక ఆమె నటించిన చిత్రాలు విజయం సాధించలేదు.

చాలా గ్యాప్ తర్వాత

చాలా గ్యాప్ తర్వాత

కేథరిన్ తెలుగులో చివరగా నటించిన చిత్రం నేనే రాజు నేనే మంత్రి. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం రావడం లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఆమె ఎదురుచూపులు మంచి ఫలితం దక్కింది. ఈ చిత్రంలో కేథరిన్ పాత్రకు ఎక్కువ ప్రాధానత్య ఉంటుందట.

డియర్ కామ్రేడ్ చిత్రంతో

డియర్ కామ్రేడ్ చిత్రంతో

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. భరత్ కమ్మ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తాడట. క్రాంతి మాధవ్ కూడా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X