విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా ‘దొరసాని’... హీరోయిన్ ఆవిడేనా?

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్లో అతితక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజికి ఎదిగిన విజయ్ దేవరకొండ త్వరలో తన తమ్ముడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. తను ఫాంలో ఉన్నపుడే తమ్ముడిని కూడా పరిచయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించిన విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ద్వారా జీవిత-రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాకు 'దొరసాని' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, అక్టోబర్ 10న సినిమా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

Vijay Deverakonda’s brother Anand Deverakonda debut movie details

తెలంగాణ విలేజ్ ప్రాంతానికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగుతుందని, షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక కొన్ని రోజులుగా యాక్టింగ్ వర్క్ షాపులో పాల్గొంటూ సినిమా కథకు తగిన విధంగా తెలంగాణ స్లాంగ్, ఇతర అంశాలపై శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.

పెళ్లి చూపులు సహ నిర్మాత, విజయ్ దేవరకొండ బంధువు యష్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

కాగా... విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రం అక్టోబర్ 5న విడుదల కాబోతోంది. అనంతరం అక్టోబర్ 10న తన తమ్ముడి సినిమా లాంచింగ్ ఈవెంటులో పాల్గొనేందుకు విజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ నోటా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X