విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డ్.. సౌతిండియాలోనే ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరో.!

By Manoj Kumar P

'పెళ్లి చూపులు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇక, ఈ మూవీ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో యూత్‌లో భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి ఈ యంగ్ హీరో టాలీవుడ్ స్టార్ అయిపోయాడు. కొద్ది రోజులుగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్న విజయ్.. తాజాగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు. ఆ వివరాలు మీకోసం.!

వరుస షాక్‌లతో విజయ్‌కు ఇబ్బందులు

వరుస షాక్‌లతో విజయ్‌కు ఇబ్బందులు

కెరీర్ ఆరంభంలో ‘పెళ్లి చూపులు', ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం' వంటి కొన్ని సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే, ఈ మధ్య అతడికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అతడు నటించిన ‘నోటా' నుంచి వరుసగా ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. ‘ట్యాక్సీవాలా' పర్వాలేదనిపించింది.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న క్రేజీ స్టార్

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న క్రేజీ స్టార్

వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది. మొత్తం ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను పూరీ, చార్మీతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

 దీని వల్ల విజయ్‌కు భారీ ఎదురుదెబ్బ

దీని వల్ల విజయ్‌కు భారీ ఎదురుదెబ్బ

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. ఫలితంగా రౌడీ అభిమానులను నిరాశకు గురి చేసింది. కానీ, విజయ్.. రష్మిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

రెండు చోట్లా ఫ్లాప్.. అక్కడ సూపర్ హిట్

రెండు చోట్లా ఫ్లాప్.. అక్కడ సూపర్ హిట్


‘డియర్ కామ్రేడ్' పలు భాషల్లో విడుదలైంది. ఎక్కడా మంచి టాక్‌ను సొంతం చేసుకోలేకపోయింది. అలాగే, టెలివిజన్ ప్రీమియర్‌గా వచ్చిన ఈ సినిమా అర్బన్‌లో 5.47 రేటింగ్ సాధించింది. అయితే, ఓవరాల్‌గా మాత్రం 4.90 రేటింగ్‌నే దక్కించుకుంది. రెండు చోట్లా విఫలమైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం ఇరగదీసేసింది. గతంలో ఏ సినిమాకూ రాని స్థాయిలో దీనికి క్లిక్ వచ్చాయి.

విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డ్

విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డ్

ఇక ఇదే సినిమా కొద్ది రోజుల క్రితం హిందీలోకి డబ్ అయింది. అదే టైటిల్‌తో యూట్యూబ్‌లో విడుదలైన ఈ మూవీకి ఉత్తరాది ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సినిమాకూ ఈ స్థాయి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. ఇటీవలే 100 మిలియన్ మార్కును సైతం దాటేసింది.

Recommended Video

Prabhas In Trouble, Prabhas20 Film Shooting Held in Georgia
సౌతిండియాలోనే ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరో.!

సౌతిండియాలోనే ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరో.!

తాజాగా ఈ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘డియర్ కామ్రేడ్' హిందీ వెర్షన్ ఇప్పటి వరకు 1.3 మిలియన్ లైక్స్‌, 101 మిలియన్ వ్యూస్‌ రాబట్టింది. ఫలితంగా సౌత్ ఇండియాలోనే ఎక్కువ లైక్స్ సాధించిన సినిమాగా నిలిచింది. రామ్ నటించిన ‘హలో గురూ ప్రేమ కోసమే' హిందీ వెర్షన్ ‘దుండార్ కిలాడీ' 1.2 మిలియన్ లైక్స్‌తో రెండో స్థానంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X