twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డియ‌ర్ కామ్రేడ్‌కు అరుదైన గుర్తింపు.. ఆస్కార్ ఎంట్రీ లిస్టులో విజయ్ దేవరకొండ మూవీ

    |

    క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ, కన్నడ భామ రష్మి మందన్న హీరో, హీరోయిన్లుగా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకొన్నది. ఈ చిత్రం ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపిక కావడం విశేషం. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ ఈ చిత్రం సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆస్కార్ ఎంట్రీలో నిలిచిన విశేషతను గురించి మరిన్నీ విషయాలు..

    ఆస్కార్ ఎంట్రీ లిస్టులో

    ఆస్కార్ ఎంట్రీ లిస్టులో

    ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటీ (ఎఫ్ఎఫ్‌ఐ) ఎంపిక చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఎఫ్ఎఫ్‌ఐ రూపొందించిన జాబితాలో ఈ చిత్రంతోపాటు మ‌రో 28 చిత్రాలు లిస్టులో ఎంపిక‌య్యాయి. ప్రస్తుతం కోల్‌కతాలో స్క్రీన్ ప్రాసెస్ జరుగుతున్నది. ఈ చిత్రాల‌న్నింటినీ స్క్రీనింగ్ చేసే వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారు.

    ఎంట్రీ లిస్టులో చిత్రాలు ఇవే

    ఎంట్రీ లిస్టులో చిత్రాలు ఇవే

    ఆస్కార్ 2020లో జరిగే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి పంపే భారతీయ చిత్రాల్లో తమిళం నుంచి వడచెన్నై, ఉయ్యారే, యూరి సర్జికల్ స్ట్రయిక్, సూపర్ డీలక్స్, ఒఎస్7, కురుక్షేత్ర, కేసరి, డియర్ కామ్రేడ్, బద్లా, బదాయిహో, ఆర్టికల్ 15, అంధాదూన్ చిత్రాలు ఉన్నాయి. `డియ‌ర్ కామ్రేడ్‌` మాత్ర‌మే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం.

    కోల్‌కతాలో స్క్రీనింగ్

    కోల్‌కతాలో స్క్రీనింగ్

    కోల్‌కతాలో స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తి కాగానే సెప్టెంబర్‌లోనే తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియకు ప్రముఖ దర్శకులు అపర్ణాసేన్ జ్యూరీగా వ్యవహరిస్తున్నారు. డియర్ కామ్రేడ్ చిత్రం వామ భావాల కథా నేపథ్యంలో ప్రేమ కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

    రూ.30 కోట్ల వసూళ్లతో

    రూ.30 కోట్ల వసూళ్లతో

    భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం జూలై 26వ తేదీన విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది. దక్షిణాది భాషల్లో విడుదలైన యూత్‌ను ఆకట్టుకొంది. బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Hero Vijay Deverakonda last release ‘Dear Comrade’ has been officially selected for India’s Oscar entry list by Film Federation of India (FFI). Along with ‘Dear Comrade’ 28 films from different languages are also picked by FFI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X