డియర్ కామ్రేడ్ ట్విటర్ రివ్యూ.. విజయ దేవరకొండ మూవీకి షాకింగ్ రిపోర్టు

Recommended Video

Dear Comrade Movie Twitter Review || డియర్ కామ్రేడ్ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. ఇప్పటికే క్రేజీ జోడీగా ఈ జోడీ పేరుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ రోజు (జులై 26) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగానే అనగా జులై 25 వ తేదీనే ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లో రిలీజ్ చేశారు. అక్కడ 'డియర్ కామ్రేడ్' చూసిన కొందరు ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అందులో కొన్ని...

ఇదో స్లో క్లాసీ మూవీ..

ఫస్ట్ హాఫ్‌లో మొదటి 25 నిముషాలు, చివరి 5 నిమిషాలు ఫుల్ ఫైరింగ్.. మిగితా పార్ట్ అంతా బోరింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లింది కానీ, ఇదో స్లో క్లాసీ మూవీ. నాని హీరోగా వచ్చిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమా లాగే ఉంది.

ఆ ఐడియా ఎక్కడిదో కానీ బ్లెండర్ మిస్టేక్

ఓ కొత్త డైరెక్టర్ అయి ఉండి ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేద్దాం అనే ఐడియా ఎక్కడిదో కానీ బ్లెండర్ మిస్టేక్. డైరెక్టర్ ఒత్తిడికి లోనయ్యాడని అర్థమవుతోంది. డియర్ కామ్రేడ్ సినిమాకు 130 నిమిషాల రన్ టైమ్ ఉంటే సరిపోయేది.

ఇక ఎవడురా విజయ్‌ని ఆపేది..

డియర్ కామ్రేడ్ సినిమా విజయ్ దేవరకొండను టాప్ హీరో లిస్ట్‌లో చేర్చేసింది. ఇక ఎవడురా విజయ్‌ని ఆపేది.. కంటెంట్ ఉన్నోడికి కట్‌అవుట్‌తో పని లేదు.. విమర్శకులకు ఫకాఫ్.

డీసెంట్ సినిమా.. బాగుంది

ఓవరాల్ గా చూస్తే డియర్ కామ్రేడ్ డీసెంట్ సినిమా. ఎప్పటిలాగే సినిమా మొత్తం విజయ్ దేవరకొండ అద్భుతమైన నటన కనబర్చాడు.

ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్.. సెకండ్ హాఫ్ ఎమోషనల్

ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్ చేసింది.. సెకండ్ హాఫ్ ఎమోషనల్ ఫీలింగ్స్ తెచ్చింది. మొత్తానికి రియలిస్టిక్ గా ఉంది.. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన లవ్ స్టోరీ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా గట్టిగా కనెక్ట్ అవుతారు. విజయ్ దేవరకొండ నటన బాగుంది.

రష్మిక, విజయ్ తెలివైన ప్రదర్శన

డియర్ కామ్రేడ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారు.. చాలా బాగా తీశారు కూడా. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న చాలా తెలివైన ప్రదర్శన కనబర్చారు.

రా లవ్ స్టోరీ.. 15 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది

డియర్ కామ్రేడ్ సినిమా ఓ ముడి ప్రేమ కథ.. మనసును హత్తుకుంటుంది. నెరేషన్ టైమ్ 15 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న బాగా యాక్ట్ చేశారు.

యాహూ..! బొమ్మ బ్లాక్‌బస్టర్ బొమ్మ

మా యూఎస్ ఫ్రెండ్ చెప్పాడు. యాహూ..! బొమ్మ బ్లాక్‌బస్టర్ బొమ్మ డియర్ కామ్రేడ్ సినిమా. అర్జున్ రెడ్డి రేంజ్ మూవీ అంట. యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

ప్రతీ ఒక్కరి జీవితంలో కామ్రేడ్

ప్రతీ ఒక్కరి జీవితంలో కామ్రేడ్ ఉంటాడని తెలిసేలా చేసింది. నా కామ్రేడ్ నా ఫాదర్. ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఓ కామ్రేడ్ ఉంటాడని వెతికేలా చేసింది డియర్ కామ్రేడ్.

భావోద్వేగాల కలయిక డియర్ కామ్రేడ్

ఫస్ట్ హాఫ్ నచ్చింది. భావోద్వేగాల కలయిక డియర్ కామ్రేడ్. నా పర్సనల్ ఫీలింగ్ సెకండ్ హాఫ్ కాస్త డ్రాగ్ అనిపించింది. ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు. కానీ నేను రష్మిక కోసం మరోసారి చూస్తాను.

విజయ్ దేవరకొండకు మరో బ్లాక్‌బస్టర్

విజయ్ దేవరకొండ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ చేరింది. బాబీ, లిల్లీల పవర్ ఫుల్ లవ్ స్టోరీ ఇది. ఇద్దరు కూడా అగ్రశ్రేణి ప్రదర్శన కనబర్చారు. భరత్ కమ్మ అండ్ టీమ్ ఓ వైభవం తీసుకొచ్చింది.

కాలేజీ ఎపిసోడ్స్ బాగున్నాయి.. రియలిస్టిక్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పర్‌ఫార్‌మెన్స్ రియలిస్టిక్ గా ఉంది. సాంగ్స్, కాలేజీ ఎపిసోడ్స్ బాగున్నాయి. స్టోరీ లైన్, స్లో నెరేషన్, హీరో గ్యాంగ్, సినిమా రన్ టైమ్ నెగెటివ్ అని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X