Devarakonda Dussehra Dhamaka: ఏడాది ఫ్రీ టికెట్స్.. కలిసి లైగర్ సినిమా.. ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన విజయ్!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న విజయ్ దేవరకొండ గత రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ వివరాల్లోకి వెళితే

లైగర్ ఫీవర్
చివరగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ. ఆ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. సినిమా పరంగా బాగానే ఉన్నా బాక్సాఫీస్ వద్ద కాస్త నిరాశ పరిచింది.

భారీ అంచనాలు
ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా మొదలు పెట్టాడు. అప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఒక బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

షూట్ పెండింగ్
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ముంబైలో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొదటి వేవ్ కరోనా వచ్చినప్పుడు షూటింగ్ ప్యాకప్ చెప్పడంతో యూనిట్ సభ్యులు అందరూ తిరిగి హైదరాబాద్ చేరారు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు గోవాలో షూట్ మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీగా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరగగా ఎన్ని కోట్లు ఇచ్చినా థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

భారీ స్థాయిలో
ఈ సినిమాని కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ అలాగే పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్ బ్యానర్స్ మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కథానాయికగా 'అనన్య పాండే' తెలుగు తెరకి పరిచయమవుతోండగా ముందు సినిమాను పూరి - ఛార్మి కలిసి నిర్మించాలనుకున్నారు. కానీ కంటెంట్ నచ్చడంతో కరణ్ జొహార్ టీమ్ కూడా నిర్మాణ భాగస్వాములయ్యారు.

దసరా ధమాకా
ఆ సంగతి పక్కన పెడితే దసరా సందర్భంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు భలే ఆఫర్లు ఇచ్చారు. గత రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తి, ఫ్యాన్స్ ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ, వాళ్లు కోరిన కోరికలు నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు. ఒక అభిమాని కోరిక మేరకు అతని ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చిన విజయ్, నీతో లైగర్ మూవీ చూడాలని ఉందన్న మరో అభిమాని కోరిక తీర్చుతూ నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో థియేటర్ లో లైగర్ మూవీ చూద్దామని చెప్పి షాక్ ఇచ్చారు.
Recommended Video

ప్రభాస్ తో
మరో అభిమానికి విజయ్ దేవరకొండ ఇటీవల ప్రారంభించిన ఏవీడీ మల్టీప్లెక్స్ లో ఏడాదిపాటు ఏ సినిమా అయినా చూసేందుకు ఏడాది పాటు టికెట్ ఫ్రీ అని అతన్ని సర్ ప్రైజ్ చేశారు. మన రౌడీ గ్యాంగ్ అందరితో కలిసి లైగర్ మూవీ చూద్దామని మరికొందరు అభిమానులకు ప్రామిస్ చేసి వారిని ఫుల్ ఖుషీ చేశారు. మరో అభిమాని ప్రభాస్ ను కలిపించండి అని కోరగా దానికి కూడా డన్ అంటూ చెప్పారు. అలా మొత్తం మీద ఫాన్స్ అందరినీ అలరించారు.


Click it and Unblock the Notifications











