ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి'. ఈ చిత్రంలో తెలుగు హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇతని పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఇందులో విజయ్ దేవరకొండ... విజయ్ ఆంటోనీ అనే పాత్రలో కనిపించబోతున్నారు. చూస్తుందే ఇందులో అతనిది ఫోటోగ్రాఫర్ రోల్అ ని తెలుస్తోంది. 'నిజం ఎప్పుడూ అందంగానే ఉంటుంది మధురవాణిగారు' అంటూ విజయ్ ఆంటోనీ చెప్పే డైలాగుతో పోస్టర్ రిలీజ్ చేశారు.
సమంత ఇందులో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఆమెతో కలిసి పని చేసే ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో 'మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఆమె తన జర్నల్ గురించి చెప్పే క్రమంలోనే సినిమా రన్ అవుతుందని అంటున్నారు.
మహానటి' సినిమా కోసం తొలిసారిగా సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెబితే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పి సమంతను ఒప్పించాడట.
వై జయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ విడుదల కానుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.