ఏందే నీ యవ్వ.. అలా అంటున్నవ్.. హీరోయిన్‌పై విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాలుగు హీరోయిన్లతో రొమాన్స్ పండించారు విజయ్ దేవరకొండ. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (ఆదివారం) జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు ఈ రౌడీ స్టార్. వివరాల్లోకి పోతే..

విజయ్ దేవరకొండ సహా నలుగురు హీరోయిన్స్

విజయ్ దేవరకొండ సహా నలుగురు హీరోయిన్స్

ఆదివారం రోజు హైదరాబాద్‌లో వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, నలుగురు హీరోయిన్స్.. రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసాలతో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. అయితే ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

Recommended Video

World Famous Lover Is My Last Love Story Says Vijay Devarakonda | ఇదే నా చివరి లవ్ స్టోరీ!
హీరోయిన్‌పై విజయ్ దేవరకొండ కామెంట్

హీరోయిన్‌పై విజయ్ దేవరకొండ కామెంట్

సాధారణంగానే ఆకర్షణీయమైన పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతుంటాడు విజయ్. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో మాత్రం ఇంకాస్త ముందుకెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌ని 'ఏందే నీ యవ్వ.. అలా అంటున్నవ్..' అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

 విజయ్ దేవరకొండ గారితో అంటూ హీరోయిన్ స్పీచ్

విజయ్ దేవరకొండ గారితో అంటూ హీరోయిన్ స్పీచ్

అంతకంటే ముందు ఇదే వేదికపై మాట్లాడిన ఐశ్వర్య రాజేష్.. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని, ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించిందని చెప్పింది. ఆమె మాట్లాడుతున్న సమయంలో 'గారు' అనే పదాన్ని బాగా గమనించిన విజయ్ దేవరకొండ.. తన టైమ్ రాగానే అదే వేడుకలో ఆమెపై కామెంట్ విసిరాడు.

సువర్ణా!! ఏందే.. నీ యవ్వ.. అలా అంటున్నావ్

సువర్ణా!! ఏందే.. నీ యవ్వ.. అలా అంటున్నావ్

నాతో నటించిన ఐశ్వర్య రాజేశ్ నన్ను గారు గారు అంటోంది. 'ఐశ్వర్యా.. గారు గారు అంటున్నావ్.. ఏంటి? సువర్ణా!! ఏందే.. నీ యవ్వ.. గారు గారు అంటున్నావ్' అంటూ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఐశ్వర్య తొలి తెలుగు సినిమా ఇది. తెలుగు బాగా మాట్లాడుతోంది. సినిమాలో బాగా నటించింది అని చెప్పాడు విజయ్ దేవరకొండ.

కొత్త ఎక్స్‌పీరియన్స్.. మీరంతా మ్యాజిక్ చూస్తారు

కొత్త ఎక్స్‌పీరియన్స్.. మీరంతా మ్యాజిక్ చూస్తారు

''ఇక సింగిల్స్ వద్దని ఈ సినిమాతో సిక్స్ కొట్టేందుకు బ్యాట్ గట్టిగా ఊపా.. బాల్ గాళ్లో ఉంది. స్టేడియం బయటపడుతుందో బౌండరీ దగ్గర పడుతుందో నాకు తెలియదు. కాని నా నుండి గ్యారంటీ ఏంటంటే.. ఎప్పుడు మీరు విజయ్ దేవరకొండ సినిమాకి వెళ్లినా ఖచ్చితంగా కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఈ సినిమాతో అదే ఇస్తున్నా. ఫిబ్రవరి 14న మీరంతా మ్యాజిక్ చూస్తారు'' అని అన్నాడు విజయ్ దేవరకొండ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X