ఇలా పోలీసుల పక్కన కూర్చోవాల్సి వస్తుందని ఊహించలేదు.. విజయ్ దేవరకొండ సెన్సేషన్

టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా సినిమా 'డియర్ కామ్రేడ్'. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా విడుదలయ్యేక మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కెమిస్ట్రీకి మరోసారి మంచి మార్కులు పడ్డాయి. చిత్రంలో లిల్లీగా రష్మిక, బాబీగా విజయ్ దేవరకొండ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇందులో రష్మిక ఓ మహిళా క్రికెటర్ గా నటించిన కారణంగా తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ ముఖ్య అతిధిగా ఓ కార్యక్రమం నిర్వహించారు డియర్ కామ్రేడ్ టీమ్.

విజయ్ దేవరకొండ, రష్మికలతో మిథాలీ రాజ్

విజయ్ దేవరకొండ, రష్మికలతో మిథాలీ రాజ్

డియర్ కామ్రేడ్ యూనిట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఆసక్తికరంగా మాట్లాడింది. విజయ్‌ దేవరకొండను ఆటపట్టిస్తూ అతనిపై జోకులు వేసి సందడి వాతావరణం క్రియేట్ చేసింది మిథాలీ. విజయ్, మిథాలీ మధ్య నడిచిన సరదా సంభాషణ అక్కడున్న వారందరినీ కడుపుబ్బా నవ్వించింది.

విజయ్.. నీ కంటే రష్మిక బ్యాటింగే బెటర్

విజయ్.. నీ కంటే రష్మిక బ్యాటింగే బెటర్

లిల్లీ అనే క్రికెటర్ పాత్రలో రష్మిక మందన్న బ్యాటింగ్ ఎలా ఉందని విజయ్ దేవరకొండ వేసిన ప్రశ్నపై స్పందించిన మిథాలీ.. అవును. నీకంటే తనే బాగా బ్యాటింగ్‌ చేసింది అని పంచ్ డైలాగ్ విసిరింది. దీనిపై మళ్ళీ విజయ్ దేవరకొండ మరింత ఆసక్తికరమైన రిటర్న్ పంచ్ విసిరాడు. 'నేను అడిగేది యాక్టింగ్‌ గురించి కాదు.. బ్యాటింగ్ గురించి‌' అని ఆయన అనడం విజయ్ లోని మాటకారి తనాన్ని మరోసారి బయట పెట్టింది.

పోలీసుల గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ

పోలీసుల గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ


మిథాలీ రాజ్ తో పాటు ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో విజయ్‌ చూపు వారిపై కూడా పడింది. ఆ పోలీసులను ఉద్దేశిస్తూ.. ''ఇలా పోలీసు వాళ్ళ పక్కన కూర్చుంటానని కలలో కూడా ఊహించలేదు'' అంటూ చమత్కరించాడు విజయ్ దేవరకొండ.

 డియర్ కామ్రేడ్ మూవీ

డియర్ కామ్రేడ్ మూవీ

నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రెండోసారి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. తొలి రోజే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం అన్ని సెంటర్లలో యావేరేజ్‌గా ఆడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X