అబ్బో! అది మా వల్ల కాదు.. ఈ లైఫ్ టైమ్‌లో జరగదు.. దింపుతున్నాం రెడీగా ఉండండి: విజయ్ దేవరకొండ
క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్'. చిత్రంలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగస్టు 23 న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్బంగా వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. రాజేంద్రప్రసాద్ గారు మీరు మా గురించి మాట్లాడటం గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మీ లైఫ్‌లో చేసిన సినిమాలు నేను ఈ లైఫ్ టైమ్‌లో చేయలేనేమో. అది మా వల్ల కానీ పని అది. అసలు ఈ రోజు ఇక్కడ ఎందుకున్నామంటే కెఎస్ రామారావు, రాశీ, ఐశ్వర్య మేమంతా ఒక టీం. ఇక్కనుంచి ప్యాక్‌అప్ చేస్తే ఈ టీం అంతా షూట్‌కి వెళ్లడమే. ఐశ్వర్య గురించే అందరం ఇక్కడికి వచ్చాము.

ఐశ్వర్య రాజేష్ తెలుగుకి రాకముందే ఆమె తమిళ్ సినిమాలు చూసి నేను ఫిదా అయ్యాను. ఇక రామారావు గారి గురించి చెప్పాలంటే.. ఆయన, సినిమా షూటింగ్‌లో డాడీ లాంటి వారు. సెట్స్‌పై అన్నీ తానై చూసుకుంటూ నటీనటులకు కావాల్సినవన్నీ ఇస్తుంటారు. రామారావు గారికి సినిమానే లోకం. కౌసల్య కృష్ణమూర్తి సినిమా సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. త్వరలో మన సినిమాలు కూడా దింపుతున్నాం.. రెడీగా ఉండండి'' అన్నారు.


Click it and Unblock the Notifications











