twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చాలా భయంకరం.. అబ్బో! అది ఊహించుకుంటేనే.. విజయ్ దేవరకొండ

    |

    Recommended Video

    Vijay Devarakonda Speech At Kousalya Krishnamurthy Movie Pre Release Event || Filmibeat Telugu

    గతంలోలా లేవు నేటి పరిస్థితులు. సినిమాల విడుదలకు ముందు ప్రీ రిలీజ్ వేడుకలు వేడుకలు, విడుదలయ్యాక సక్సెస్ సంబరాలు, మధ్య మధ్యలో స్పెషల్ ట్రీట్స్ ఇలా అభిమానులకు ఎప్పటికప్పుడు చేరువవుతూ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు నేటితరం సినీ ప్రముఖులు. అయితే ఈ వేదికలపై కేవలం సినిమాకు సంబందించిన విషయాలే కాకుండా సామాజిక బాధ్యతగా తమ వంతు మెసేజ్ ఇస్తుండటం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అలాంటి ఓ వండర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. వివరాల్లోకి పోతే..

    విజయ్ దేవరకొండ స్టేజీ ఎక్కాడంటే చాలు

    విజయ్ దేవరకొండ స్టేజీ ఎక్కాడంటే చాలు

    యంగ్ హీరో, రౌడీ స్టార్ వెండితెరపైనే కాదు.. స్టేజీ ప్రసంగాల్లోనూ యమ యాక్టివ్ అని అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ స్టేజీ ఎక్కాడంటే చాలు తనదైన మాటలతో అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే నిన్న (ఆగస్టు 20 న) హైదరాబాద్ లో జరిగిన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడి ప్రేక్షకులకు ఓ విలువైన సందేశమిచ్చాడు.

    'కౌసల్య కృష్ణమూర్తి' పై ప్రశంసలు.. ఆ వెంటనే

    'కౌసల్య కృష్ణమూర్తి' పై ప్రశంసలు.. ఆ వెంటనే

    కేఎస్ రామారావు సమర్పణలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌'. ఓ సాధారణ కుటుంబంలోని ఆడపిల్ల టీమ్ ఇండియాలో స్థానం సంపాదించి గొప్ప క్రికెటర్‌గా ఎలా ఎదిగిందనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై, నిర్మాత కేఎస్ రామారావుపై, ఇతర యూనిట్ సభ్యులందరిపై ప్రశంసలు గుప్పించిన విజయ్ దేవరకొండ చివరగా సామాజిక కోణంలో నాలుగు మాటలు చెప్పి ఆకట్టుకున్నాడు.

     2020 తర్వాత హైదరాబాద్ పరిస్థితి

    2020 తర్వాత హైదరాబాద్ పరిస్థితి

    రానున్న రెండు సంవత్సరాల్లో అనగా 2020 తర్వాత హైదరాబాద్ పరిస్థితి దారుణంగా ఉంటుందని, హైదరాబాద్ లో చాలా వరకు నీటి శాతం తగ్గే అవకాశం ఉన్నట్లు ఇటీవల కొన్ని సర్వేలు తెలిపాయి. వాటిని గుర్తుచేస్తూ వాటర్ సేవ్ చేయడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నాడు విజయ్ దేవరకొండ.

     చాలా భయంకరం.. అబ్బో! అది ఊహించుకుంటేనే

    చాలా భయంకరం.. అబ్బో! అది ఊహించుకుంటేనే

    మనిషి జీవితంలో నీటి ప్రాధాన్యత ఎక్కువ అని, నీళ్లు లేని ఈ జీవితం చాలా భయంకరంగా ఉంటుందని అన్నాడు విజయ్. ఆ పరిస్థితి ఒక్కసారి ఉహించుకొని ప్రతీ ఒక్కరు తమ వంతుగా వాటర్ సేవ్ చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పాడు. ఎలాగైతే పెట్రోల్ సేవ్ గురించి ఆలోచిస్తామో నీటిని సేవ్ చేయడంలోనూ అలాగే ఆలోచిస్తే రానున్న రోజుల్లో నీటి కష్టాలు వచ్చే అవకాశం ఉండదని అన్నాడు విజయ్ దేవరకొండ.

    కౌసల్య కృష్ణమూర్తి మూవీ

    కౌసల్య కృష్ణమూర్తి మూవీ

    'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌' చిత్రంలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించగా.. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగస్టు 23న ఈ సినిమా విడుదల కానుంది.


    English summary
    Different storyline movie Kousalya Krishnamurthy which is directed by Bhimaneni Srinivasa Rao. This movie trailer launched. And movie pre release event in hyderabad with special guest of vijay devarakonda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X