విజయ్ దేవరకొండ క్రేజీ ఆఫర్ వదిలేసుకున్నాడా.. కారణం ఇదే!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నాడు. యువతలో విజయ్ దేవరకొండకు భారీగా క్రేజ్ పెరిగింది. తన తదుపరి చిత్రాలలో కూడా యువతకు నచ్చే అంశాలు ఉండాలని విజయ్ భావిస్తున్నాడు. అందుకే చిత్రాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తున్నాడట. విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ మధ్యన విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ లో నటించాలని ఆసక్తి ప్రదర్శించాడు. తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ ఆఫర్ రిజెక్ట్ చేశాడనే వార్త వైరల్ గా మారుతోంది.

ప్రపంచకప్ విజయం

ప్రపంచకప్ విజయం

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ 83 అనే టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. 1983 ఓ భారత క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచకప్ విజయం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించగా నో చెప్పినట్లు తెలుస్తోంది.

కృష్ణమాచారి శ్రీకాంత్

కృష్ణమాచారి శ్రీకాంత్

మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించారట. కానీ ఆ అవాకాశాన్ని విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండని తీసుకోవడం ద్వారా తెలుగు మార్కెట్ ని కూడా ఆకర్షించాలని భావించారు. విజయ్ దేవరకొండ ఈ క్రేజీ చిత్రానికి నో చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాంత్ కూడా 1983 టీం ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 కారణం ఇదే

కారణం ఇదే

విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఉందట. కేవలం సోలో హీరోగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. దానికి సంబందించిన ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇలా చిన్న పత్రాలు చేయడం కరెక్ట్ కాదని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ త్వరలో విజయ్ దేవరకొండని బాలీవుడ్ లో లాంచ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కరణ్ జోహార్ నోట విజయ్ దేవరకొండ మాట

కరణ్ జోహార్ నోట విజయ్ దేవరకొండ మాట

శ్రీదేవి కుమార్తె కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన సందర్భంగా విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించింది. అతడితో ఓ చిత్రం చేస్తానని తెలిపింది. కరణ్ జోహార్ కూడా విజయ్ దేవరకొండని ప్రశంసించాడు. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రి మూవీస్ బ్యానర్ లో డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X