కియారాకు విజయ్ దేవరకొండ షాకింగ్ గిఫ్ట్.. తప్పుగా అనుకోవద్దంటూ గిఫ్ట్ ప్యాక్‌లో...
అర్జున్ రెడ్డి రీమేక్‌గా రూపొందిన కబీర్ సింగ్ చిత్రం బాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపిస్తున్నది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల కియారా, షాహీద్, సందీప్ రెడ్డి వంగ పార్టీ కూడా చేసుకొన్నారు. అయితే తన కెరీర్‌లో అతిపెద్ద సక్సెస్‌ను అందడంతో కియారా ఆనందంలో మునిగి తేలుతున్నది. ఈ సంతోష సమయంలో కియారాకు అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ప్రేమతో ఓ గిఫ్టు పంపాడు. ఎంతకు గిప్ట్ ప్యాక్‌లో ఏమున్నదంటే..

కియారా అద్వానిపై ప్రశంసల వర్షం
బాలీవుడ్‌లో కబీర్ సింగ్ రూపంలో కియారాకు భారీ విజయం దక్కింది. దాంతో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ప్రీతిగా ఈ సినిమాలో నటనకు కియారాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. భావోద్వేగంతో కూడిన ప్రేమికురాలి పాత్రలో మ్యాజిక్ చేశావంటూ సినీ విమర్శకులు కితాబిస్తున్నారు. దాంతో తనపై ప్రేమ కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించింది.

విజయ్ దేవరకొండ గిఫ్ట్ పంపి
తన కెరీర్‌లో అరుదైన విజయాన్ని దక్కినందుకు గాను అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ప్రేమగా స్పందించాడు. అతడి నుంచి ప్రశంసలే కాకుండా ఓ మంచి గిఫ్ట్‌ను కూడా అందుకొన్నది. కియారాకు డిజైన్ డ్రస్‌ను పంపించాడు. అంతేకాకుండా ఎమోషనల్‌గా ఓ మెసేజ్‌ను పంపాడు. దాంతో కియారాకు మరింత ఆనందం దక్కింది.

తప్పుగా అనుకోవద్దని
కబీర్ సింగ్ సక్సెస్ సాధించిన సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. కియారా.. కంగ్రాట్స్ ఫర్ కబీర్ సింగ్. ఈ విజయాన్ని బాగా ఆస్వాదించు. నా ప్రశంసలతో నీకు కొన్నా నా దుస్తులు కూడా పంపిస్తున్నాను. అలా పంపించడం తప్పుగా అనిపిస్తుందేమో కానీ.. అవి నాకు అత్యంత ఇష్టమైనవి అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ బహుమతిని అందుకొన్న కియారా థ్యాంక్స్ అంటూ బదులిచ్చింది.

కబీర్ సింగ్ చూడలేదని
విజయ దేవరకొండ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. కబీర్ సింగ్ సినిమా చూడలేదు. ఫ్రాన్స్‌లో షూటింగ్ కారణంగా చూడలేకపోయాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత జ్వరంతో బాధపడటం వల్ల వీలు కాలేదు. కానీ ఎప్పుడెప్పుడూ చూడాలా అనిపిస్తున్నది. త్వరలోనే కబీర్ సింగ్‌ను చూస్తాను. నా ఫ్రెండ్ రీమేక్‌ను ఎలా తెరకెక్కించాడో చూడాలనే ఆసక్తి కలుగుతుంది అని విజయ్ దేవరకొండ తెలిపాడు.

150 కోట్ల వసూళ్లు
కాగా, కబీర్ సింగ్ బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్నది. గత ఎనిమిది రోజుల్లో సుమారు రూ.150 కోట్ల వసూళ్లకు చేరువైంది. ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ సినిమాకు మంచి ఆదరణ వ్యక్తమవుతున్నది. త్వరలోనే ఈ చిత్రం రూ.200 కోట్ల వసూళ్లను అధిగమించ వచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











