అరేయ్.. ఆ భాష ఏందిరా.. విజయ్‌ దేవరకొండకు నెటిజన్ల ఝలక్.. అసలేమైందంటే..

By Rajababu

Recommended Video

విజయ్ దేవరకొండ సావిత్రి పై షాకింగ్ ట్వీట్స్

అర్జున్‌రెడ్డితో సెన్సేషనల్‌ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండకు బోల్డుగా మాట్లాడే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్‌రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. ఓ బూతు పదాన్ని ఉపయోగించి రిలీజ్‌కు ముందే పాపులర్ అయిపోయాడు. వేదిక ఏదైనా గానీ.. సందర్భం ఏదైనా గానీ తన మనసుకు నచ్చిన విధంగా మాట్లాడటం విజయ్ దేవరకొండ నైజం. కానీ అన్నీసార్లు మాట్లాడితే కుదరదని తాజాగా ఓ సంఘటన నిరూపించింది. తాజాగా రిలీజ్ చేసిన సావిత్రి బయోపిక్ పోస్టర్‌ గురించి చేసిన కామెంట్‌పై విజయ్ దేవరకొండను సోషల్ మీడియాలో రఫ్ ఆడించారు.

సావిత్రి గురించి విజయ్ కామెంట్

సావిత్రి గురించి విజయ్ కామెంట్

సావిత్రి బయోపిక్ సంబంధించి సావిత్రి పాత్రలో నటించిన పోస్టర్‌ను విజయ్ దేవర కొండ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోపైన వాట్ ఏ కూల్ చిక్ అంటూ కామెంట్ పెట్టారు. దాంతో ఆయనపై నెటిజన్లు గరం అయ్యారు.

 నెటిజన్ల ఫైర్

నెటిజన్ల ఫైర్

చిక్ ఏందిరా అరేయ్.. సీనియర్లను కొంచమైనా గౌరవించే సంస్కారం నేర్చుకో అంటూ కామెంట్లు వదిలాడు. మరో నెటిజన్.. నీవు ఉపయోగించిన పదం చాలా దారుణంగా ఉంది అని కామెంట్ పెట్టాడు.

నువ్వంటే అసహ్యం

నువ్వంటే అసహ్యం

ఇప్పటి వరకు నీకు నేను బిగ్ ఫ్యాన్‌ను. కానీ ఈ క్షణం నుంచి నువ్వంటే అసహ్యం. అంతటి మహానటిని పట్టుకొని చిక్ అంటావా?.. సిగ్గుచేటు. సినీ చరిత్రలో ఆమె గొప్ప నటి. రెండు సినిమాలతో పాపులర్ అయిన నీవు ఆమెను అగౌరవంగా సంబంధించడం సరికాదు అని మరో వ్యక్తి పేర్కొన్నాడు.

 నెటిజన్లకు విజయ్ దేవరకొండ జవాబు

నెటిజన్లకు విజయ్ దేవరకొండ జవాబు

నెటిజన్లు విరుచుకుపడుతుండటంతో విజయ్ స్పందించాడు. ఎవరైతే క్షమాపణలు కోరుతున్నారో, వారందరూ నేను ఉన్న చెన్నైలోని లీలా ప్యాలెస్‌కు వచ్చేయండి. మహనటి ఆడియో లాంచ్ కార్యక్రమానికి పాసులు ఇస్తాను. మీరందరు వస్తే చాలా ఆమె ఆత్మ సంతోషపడుతుంది. అప్పుడు మీ లాంటి నిజాయితీ, విలువలతో కూడిన మిమ్మల్ని అల్కాహాలిక్ బ్రేకర్స్ అంటుంది అని విజయ్ ట్వీట్ చేశారు.

సావిత్రి గారికి భయమంటే..

సావిత్రి గారికి భయమంటే..

సావిత్రి గారికి భయమంటే తెలియదు. స్వచ్ఛంద సేవకురాలు. దయార్ధహృదయులు. అమెకు కలలను సాకారం చేసుకొనే యువతి, ప్రేమ కోసం ప్రేమించే వ్యక్తిగా ఇష్టపడుతుంది. ఆ తర్వాతే ఆమె సూపర్‌స్టార్ అని విజయ్ ట్వీట్ చేశారు.

అప్లై చేసుకోండి జాబ్ ఇస్తా

అప్లై చేసుకోండి జాబ్ ఇస్తా

ఎవరైనా నా ట్వీట్‌ను తప్పుపట్టి.. నా పోస్టులను సరిగా, బాగా రాయాలనుకొనే వారు.. ఆ పోస్టుకు [email protected]కు రెస్యూమ్‌తో దరఖాస్తు చేసుకోండి. ఆ విధంగా మీకు జాబ్‌ కూడా లభిస్తుంది అని మరో ట్విట్‌లో విజయ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X