For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పొరపాటున పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన విజయ్: కాలేజ్ రోజుల్లో అమ్మాయిల కోసం.. అప్పుడు తన కోసం అంటూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అద్భుతమైన టాలెంట్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి సమయంలో తాజాగా సందీప్ కిషన్ నటిస్తోన్న 'గల్లీ రౌడీ' టీజర్‌ను లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఇందులో పొరపాటున తన పర్సనల్ సీక్రెట్‌ను లీక్ చేశాడు విజయ్. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  చీరకట్టులో సమంత అక్కినేని.. మీరెప్పుడూ చూడని అరుదైన ఫోటోలు

  విజయ్ కెరీర్ ఆప్పుడలా.. ఇప్పుడిలా

  విజయ్ కెరీర్ ఆప్పుడలా.. ఇప్పుడిలా

  ‘పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే, కొద్ది రోజులుగా అతడి కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ క్రేజీ హీరో నటించిన ‘నోటా' ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

  నాభి అందాలను ప్రదర్శిస్తున్న శ్రీజా ఘోష్.. వయ్యారాలను ఒలకబోస్తూ షోటోషూట్

  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్

  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ.. బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ‘లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది.

  వర్థమాన తార నైనిషా బ్యూటిఫుల్ గ్యాలరీ..

  పెరిగిన అంచనాలు... వచ్చేది అప్పుడే

  పెరిగిన అంచనాలు... వచ్చేది అప్పుడే

  టాలీవుడ్‌లో తనదైన శైలిని ఏర్పరచుకున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. అలాగే, పూరీ జగన్నాథ్‌కు కూడా హీరో ఎలివేషన్‌లో భిన్నమైన పనితనం ఉంది. అందుకే వీళ్లిద్దరి కలయికపై భారీ అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవల విడుదలైన పోస్టర్లు వాటిని రెట్టింపు చేసేశాయి. తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.

  కన్నుగీటిన ప్రియా ప్రకాశ్ వారియర్ వైరల్ ఫోటోలు..

  ప్రొడ్యూసర్‌గా విజయ్.. సోదరుడి కోసం

  ప్రొడ్యూసర్‌గా విజయ్.. సోదరుడి కోసం

  హీరోగా కొన్నేళ్లుగా సత్తా చాటుతోన్న విజయ్ దేవరకొండ.. ‘మీకు మాత్రమే చెబుతా' అనే సినిమాతో నిర్మాతగానూ మారాడు. ఇందుకోసం కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే బ్యానర్‌ను సైతం స్థాపించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. దామోదర అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు.

  ఎద అందాలు ప్రదర్శిస్తున్న సాక్షి అగర్వాల్.. ప్యాంట్ వేసుకోకుండా అందాల ఆరబోత

  ఫ్రెండ్స్ కోసం సహాయం చేస్తున్నాడుగా

  ఫ్రెండ్స్ కోసం సహాయం చేస్తున్నాడుగా

  సినిమా షూటింగులతో ఫుల్ బిజీగా ఉంటోన్న విజయ్ దేవరకొండ.. ఇతర హీరోలు చేసిన చిత్రాలకు సహాయం కూడా చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వాళ్లు నిర్వహించే ఈవెంట్లలో పాల్గొంటున్నాడు. అలాగే, టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు, పాటలు విడుదల చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ నటించిన ‘గల్లీ రౌడీ' టీజర్‌ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశాడు.

  పొరపాటును పర్సనల్ సీక్రెట్ లీక్ చేసి

  పొరపాటును పర్సనల్ సీక్రెట్ లీక్ చేసి

  ‘గల్లీ రౌడీ' టీజర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు ఎన్నో విషయాలు మాట్లాడాడు. అదే సమయంలో హీరో సందీప్ కిషన్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ఇందులో మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్ టైమ్‌లో సందీప్ నేను దొంగతనంగా జిమ్‌లో వర్కౌట్ చేసేవాళ్లం' అని ఓ పర్సనల్ సీక్రెట్‌ను లీక్ చేశాడు.

  కాలేజ్‌లో అమ్మాయిల కోసం.. అప్పుడు

  కాలేజ్‌లో అమ్మాయిల కోసం.. అప్పుడు

  స్పీచ్ కొనసాగిస్తూ.. ‘ఆ జిమ్‌లో సందీప్ నేను మాత్రమే ఉండేవాళ్లం. రోజూ ఎన్నో గాసిప్స్ గురించి మాట్లాడుకునే వాళ్లం. ఏదైనా ఒకరోజు నేను రాకపోయినా.. అతడు రాకపోయినా దిగాలుగా ఉండేది. నేనైతే కాలేజ్ రోజుల్లో అమ్మాయిల కోసం వేచి చూసినట్లు.. అతడు ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేసేవాడిని. అంతలా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఉండింది' అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

  English summary
  Sundeep Kishan’s new film has commenced its shooting formalities this morning in Vizag. A formal puja ceremony was held in the presence of several political leaders to kick-start the project. The film has been interestingly titled as Rowdy Baby.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X