గాయంతో విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఏం జరిగింది? అయోమయంలో ఫ్యాన్స్
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా సర్‌ప్రైజ్ చేసినప్పటికీ ఒకింత షాకిచ్చింది. ఖతర్‌లో జరుగుతున్న సైమా అవార్డుల వేడుకలో చేతి వేలుకు గాయంతో కనిపించాడు విజయ్ దేవరకొండ. దీంతో షాకైన ఆయన అభిమానులు అసలేం జరిగి ఉంటుందని అయోమయంలో పడిపోయారు. గాయం పెద్దది కాకపోయినా ఎలా జరిగిందనే కోణంలో చర్చించుకుంటున్నారు.

సైమా వేదికపై విజయ్ దేవరకొండ హవా
ఖతర్‌లో జరుగుతున్న సైమా అవార్డు 2019 వేదికపై విజయ్ దేవరకొండ తళుక్కుమన్నాడు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్‌తో అందరి దృష్టిని ఆకర్షించి వావ్ అనిపించుకున్నాడు. అంతేకాదండోయ్.. రెండు అవార్డులను సొంతం చేసుకొని సత్తా చాటాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అయోమయంలో ఫ్యాన్స్
విజయ్ దేవరకొండ లుక్ చూసి ఫిదా అయిన రౌడీ ఫ్యాన్స్ ఒక్కటే వెలితిగా భావిస్తున్నారు. అదే విజయ్ దేవరకొండ చేతి వేలుకు ఉన్న గాయం. ఈ కార్యక్రమానికి స్టైలిష్‌గా బ్లాక్ ప్యాంట్, బ్లాక్ డిజైనర్ టీ షర్ట్, వైట్ కోట్ ధరించి వచ్చిన విజయ్.. మిడిల్ ఫింగర్‌కు కట్టు కట్టుకుని కనిపించాడు. దీంతో ఆ గాయం ఎలా అయింది? ఏమైనా ప్రమాదమా? అని అయోమయంలో పడిపోయారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం గాయంతో ఉన్న విజయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇన్ని చర్చలు అవసరమా?
తన గత సినిమా 'డియర్ కామ్రేడ్' షూటింగ్ లో భాగంగా గాయపడ్డ విజయ్ దేవరకొండ మరోసారి గాయపడ్డాడా? ఇంతకీ జరిగి ఉంటుంది? అనే కోణంలో చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆ గాయం చిన్నది కాబట్టే.. సైమా వేడుకకు విజయ వచ్చాడు.. అదే పెద్ద గాయమైతే వచ్చేవాడు కాదు కదా! ఈ చిన్న దానికే ఇన్ని చర్చలు అవసరమా? అని కూడా కొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా గాయంతో మరోసారి చర్చల్లో నిలిచాడు విజయ్.

విజయ్ దేవరకొండ సినీ జర్నీ
ఇటీవలే డియర్ కామ్రేడ్ సినిమాతో కాస్త డీలా పడిన ఈ రౌడీ స్టార్ ప్రస్తుతం ప్రస్తుతం క్రాంతి మాధవ్, ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రెండు వేరు వేరు సినిమాలు చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో విజయ్ ప్లే బాయ్ రోల్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











